Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

దేవీ
సోమవారం, 1 డిశెంబరు 2025 (10:53 IST)
Harshali Malhotra
బజరంగీ భాయిజాన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హర్షాలి మల్హోత్రా మళ్ళీ బాలక్రిష్ణ నటించిన అఖండ 2లో నటించింది. భజరంగీ.. తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. అవి వద్దునుకుని స్టడీస్ పై ఫోకస్ చేశాను. అలాగే కథక్  నేర్చుకున్నాను. ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ సినిమా రావడం అదృష్టంగా భావించాను అని అన్నారు.
 
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో అఖండ 2: తాండవం రూపొందింది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. ఎస్ థమన్ సంగీతం అందించారు.ఈ చిత్రం  2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంల కీలక పాత్ర పోషించిన హర్షాలి మల్హోత్రా సినిమా విశేషాలని పంచుకున్నారు.
 
- అఖండ 2లో నా పాత్ర చాలా ఎక్సైటింగ్ గా ఉంది.  దాదాపు పదేళ్ళు తర్వాత మళ్లీ నేను థియేటర్స్ కి వస్తున్నాను. జనని అనే క్యారెక్టర్ లో కనిపిస్తాను. తను చాలా స్వీట్, కేరింగ్. తనకి అఖండ బ్లెస్సింగ్స్ ఉంటాయి. జనని లైఫ్ ఎప్పుడు డేంజర్ లో ఉన్న అఖండ తనకోసం వస్తారు
 
- బజరంగీ భాయిజాన్ తర్వాత చాలా పాత్రలు వచ్చాయి. అయితే నేను ఒక మంచి పాత్ర కోసం ఎదురు చూశాను. అలాంటి సమయంలో అఖండ2  అవకాశం వచ్చింది. లెజెండరీ నందమూరి బాలకృష్ణ గారితో నటించడం ఒక గొప్ప అవకాశం. నేను ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూశాను. నా రెండో సినిమానే తెలుగు సినిమా కావడం, ఒక లెజెండరీ యాక్టర్ తో నటించడం అద్భుతమైన అనుభూతి.
 
- నేను బాలకృష్ణ గారి సినిమాలు చూశాను. భగవత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్, అఖండ ఎలా ఎన్నో సినిమాలు చూశాను. అఖండ  అద్భుతంగా అనిపించింది. బోయపాటి గారి డైరెక్షన్ అమేజింగ్.
 
- బాలకృష్ణ గారు వెరీ కూల్. ఒక లెజెండరీ యాక్టర్ తో కలిసి నటించడం అంటే మొదట చాలా నెర్వస్ ఫీల్  అయ్యాను. అయితే ఆయన చాలా కేరింగ్ పర్సన్. నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే చూసుకున్నారు. బాలకృష్ణ గారు వెరీ ఎనర్జిటిక్, అన్ స్టాపబుల్
 
- షూటింగ్లో ఎదుర్కొన్న చాలెంజెస్ వాతావరణమే. మైనస్ డిగ్రీస్ ఉన్న కొన్ని లొకేషన్స్ లో సూట్ చేసాము. అంత చలి ప్రదేశాలలో షూటింగ్ వెరీ చాలెంజింగ్. అలాగే ఈ సినిమాలో యాక్షన్ స్టంట్స్ కూడా చేశాను.
 
- బోయపాటి గారు ఎంతో కేర్ తీసుకున్నారు. షూటింగ్ చేస్తున్నప్పుడు నెర్వస్ గా ఫీల్ అయితే నువ్వు తప్పకుండా చేయగలవని ఎంతో ప్రోత్సహించేవారు. సన్నివేశం పూర్తయిన తర్వాత అద్భుతంగా చేసావని అభినందించేవారు. ఆయన ప్రోత్సాహం నాలో మరింత ఎనర్జీని నింపింది. జననీ పాత్ర కోసం బోయపాటి గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను
 
- సల్మాన్ ఖాన్ గారితో చాలా అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మేం టేబుల్ టెన్నిస్ ఆడేవాళ్ళం .చాలా సరదాగా ఉండేది. అలాగే బాలయ్య గారితో కూడా చాలా మంచి ఫన్ మూమెంట్స్ ఉన్నాయి .ఆయన షూటింగ్లో ఎనర్జీ కోసం కషాయం తాగమని చెప్పేవారు. కానీ నాకు అల్లం అంటే ఇష్టం ఉండదు. ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ లానే చూసుకున్నారు.
 
- తెలుగులో నాకు ఇష్టమైన స్టార్స్ బాలయ్య గారు, అల్లు అర్జున్ గారు,  ప్రభాస్ గారు.
 
- నాకు సంజయ్ లీలా బన్సాలీ గారి సినిమాలో చేయాలని ఉంది. ఆయన హీరోయిన్స్ ని చూపించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే నాకు అన్ని రకాల జానర్స్ చేయాలనీ వుంది. మంచి కాంబినేషన్స్ లో మెయిన్ లీడ్ గా చేయాలని ఉంది. అలాగే ఛాలెంజింగ్  క్యారెక్టర్స్ చేయాలని ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని మోడీ, రాహుల్‌కు ఆహ్వానం?

శ్రీలంకలో దిత్వా తుఫాను విధ్వంసం 334 మంది మృతి, 370మంది గల్లంతు

ప్రియుడితో భార్య ఫోటో... చంపి మృతదేహంతో సెల్ఫీ తీసుకున్న భర్త.. ఎక్కడ?

14 యేళ్ల బాలికపై పెంపుడు తండ్రి, బావమరిది అత్యాచారం.. ఎక్కడ?

బలహీనపడిన దిత్వా తుఫాను.. ఏపీకి తప్పని భారీ వర్ష ముప్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments