Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన షూటింగ్ కు వీల్ చైర్లో వచ్చేవారు : ఫిజియోథెరపిస్ట్ సాక్షి వైద్య

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2023 (17:31 IST)
Physiotherapist Sakshi Vaidya
హీరో అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో  ‘ఏజెంట్’ సినిమా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కు సిద్ధంగా ఉంది. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. అఖిల్ కు జోడిగా సాక్షి వైద్య కథానాయికగా నటించింది. తన గురించి చెపుతూ, మాది ముంబైలోని థానే. స్కూల్, కాలేజ్ అక్కడే జరిగింది. నేను  ఫిజియోథెరపిస్ట్ ని. ఇప్పుడు నటిగా మారాను. సురేందర్ రెడ్డి గారికి కోవిడ్ తర్వాత షూటింగ్ కు వీల్ చైర్లో వచ్చేవారు. అప్పుడు నేనో ఫిజియోథెరపి చేసాను అని తెలిపారు.
 
ఏజెంట్ అవకాశం గురించి చెపుతూ, కోవిడ్ సమయంలో కాలేజ్ కూడా లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. నాకు ఖాళీ ఉండకుండా ఎదో ఒకటి చేయడం అలవాటు. ఆ సమయంలో సోషల్ మీడియా రీల్స్ చేశాను. అందులో కొన్ని వైరల్ అయ్యాయి. నా ఫ్రెండ్స్ ఆడిషన్స్ కి వెళ్ళమని సలహా ఇచ్చారు. ముంబైలో కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను. కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ నాకు పెద్దగా నచ్చలేదు. ఆ సమయంలో ఇక్కడ ప్రొడక్షన్ మేనేజర్ కాల్ చేసి సినిమా గురించి చెప్పారు. మొదట నమ్మలేదు. తర్వాత ముంబైలో ముఖేష్ అనే కాస్ట్యూమ్ డైరెక్టర్.. చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్, పెద్ద డైరెక్టర్, బిగ్ కోస్టార్, చాలా మంచి అవకాశం అని చెప్పారు. తర్వాత ఇక్కడికి వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. సురేందర్ రెడ్డి గారికి నచ్చింది. అలా ఏజెంట్ ప్రాజెక్ట్ లోకి వచ్చాను అని తెలిపింది. 
 
- నేను భరతనాట్యం నేపధ్యం నుంచి రావడం వలన డాన్స్ స్టెప్స్ ని త్వరగా నేర్చుకోగలిగాను. అఖిల్ గ్రేట్ పర్శన్. చాలా హంబుల్. చక్కగా మాట్లాడతారు. తన నుంచి చాలా నేర్చుకున్నాను.
- వరుణ్ తేజ్ గారితో ఓ సినిమా చేస్తున్నా అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పుడమికి చేరిన సునీతా విలియమ్స్... ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలేంటి?

హమాస్‌తో సంబంధాలు.. అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్టు

Marri Rajasekhar: వైకాపాకు మరో ఎదురుదెబ్బ- ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా (video)

Vishnupriya: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు యాంకర్ విష్ణుప్రియ

Rain: వేసవి కాలంలో వర్షాలు పడే అవకాశాలు.. మార్చి 22, 23 తేదీల్లో భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments