దర్శకుడు సుకుమార్ లెక్కలు మాస్టారు. ఆలోచనలు వైవిధ్యంగా వుంటాయి. ఆర్య నుంచి ఆయన తీసిన సినిమాలు అందుకు నిదర్శనమే. తాను గొప్ప దర్శకుడుననీ తన ట్రాక్ రికార్డ్‌ను ఒకసారి తెలుసుకో అని ఓ వ్యక్తికి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు కారణం సుకుమార్‌ను అతను సెన్స్‌లెస్ అని పలుసార్లు అనడమే. దీనికి ఓ కథ వుందంటూ సుకుమార్ ఇలా తెలియజేశారు.
పుష్ప సినిమాకు ఫ్రాన్స్‌కు చెందిన మిరోస్లా క్యూబా బ్రోజెక్ పనిచేశాడు. ఈయనను అల్లు అర్జున్ ఏరికోరి పట్టుకుని తెప్పించాడు. అటవీ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగా సన్నివేశాలను బట్టి షాట్ షాట్‌కు ఒక్కోసారి కెమెరా లెన్స్‌లు మార్చాల్సి వుంటుంది. ఈ విషయాన్ని మిరోస్లా క్యూబా బ్రోజెక్ కు సుకుమార్ లెన్స్‌ఛేంజ్ అంటూ చెప్పాడు. మామూలుగా కెమెరామెన్ కెమెరా లెన్స్‌లు మార్చేస్తాడు. కానీ క్యూబాకు తెలీక ఒకటికి నాలుగుసార్లు సెన్స్‌లెస్సా అంటూ అడిగాడు.
ఇది విన్న సుకుమార్‌కు మొదట అర్థంకాలేదు. తర్వాత సుకుమార్‌కు కోపం వచ్చి, నేను గొప్ప దర్శకుడిని. నా సినిమాలు చూడలేదా! అన్నట్లు మాట్లాడాడు. ఇదంతా సుకుమార్ వచ్చీరానీ ఇంగ్లీషులో చెప్పాడు. క్యూబాకు ఇంగ్లీషు భాష ఏక్సెస్ వేరుగా వుంటుంది. అది గ్రహించని సుకుమార్ తనకు సెన్స్ లేదా అని పదిసార్లు అంటాడా.. అందరిముందూ.. అంటూ కాస్త కన్నీళ్ళు పెట్టుకున్నాడట. ఇది గమనించిన క్యూబా.. కూడా ఫీలయ్యాడు. తర్వాత అల్లు అర్జున్ లాంటివారు ఛేంజ్ లెన్స్ అంటూ చెప్పడంతో క్యూబాకు అర్థమైంది. ఇక అప్పటినుంచి సుకుమార్ కూడా ఛేంజ్ లెన్స్ అని మాట్లాడడం ప్రారంభించాడు. సో. భాష రాకపోతే.. ఇలానే వుంటుంది. అంటూ ఆ తర్వాత ఒకరికొకరు సారీ చెప్పుకున్నారట.