Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓన్లీ సూప‌ర్ స్టార్ ఆయ‌నే అంటోన్న రామ్‌గోపాల్ వ‌ర్మ‌

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (08:49 IST)
Varma twitter
అల్లు అర్జున్ ను రామ్‌గోపాల్ వర్మ తెగ పొగిడేస్తున్నాడు. స‌హ‌జంగా పెద్ద హీరోల ట్రైల‌ర్లు, టీజ‌ర్‌లు విడుద‌లైతే ఆయ‌న స్పందిస్తుంటారు. ‘పుష్ప’ ట్రైలర్‌ను చూసి వ‌ర్మ  సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అల్లు అర్జున్ ఓన్లీ సూప‌ర్ స్టార్. పుష్ప లాంటి పాత్రలు బన్నీ కాకుండా మరెవరూ చేయలేరన్నాడు. రియలిస్టిక్ పాత్రలు చేయాలంటే అల్లు అర్జున్ మాత్రమే పర్‌ఫెక్ట్ అనివ‌ర్మ తెగ మెచ్చుకున్నాడు.
 
పైగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, ర‌జనీకాంత్, మ‌హేష్ బాబు లాంటి హీరోలు కూడా పుష్పరాజ్ లాంటి పాత్రలు చేయ‌లేర‌ని వారిని ట్యాగ్ చేస్తూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. అంతే కాకుండా ఇలాంటి పాత్రలు చేయ‌గలరా అంటూ వారికి స‌వాల్ విసిరాడు. అలాగే చివ‌రిగా పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్ అంటూ పుష్ప మూవీ ట్రైలర్‌లోని డైలాగ్‌ను పోస్ట్ చేశాడు. 
 
ఇక నెటిజ‌న్లు వ‌ర్మ కామెంట్‌కు ఆశ్చ‌ర్య‌పోయినా ఫిదా అయ్యారు. అందుకు ఆయ‌న కామెంట్ కు లైక్ బాగానే వచ్చాయి. ఇక ఇందులో రెండు నిమిషాల 31 సెకెండ్ల ప్ర‌మోలోనే  ప్రతి సీన్ కూడా కథ గురించి ఆలోచింపచేసేలా ఉందని చెప్పారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 17న విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురంలో అంతర్గత విభేదాలు.. పార్టీలో అనేక గ్రూపులు.. లోపించిన ఐక్యత

మే 1 నుంచి జూన్ 2 వరకు తెలంగాణ జిల్లాల్లో రేవంతన్న పర్యటన.. ఎందుకంటే?

పచ్చటి సంసారంలో చిచ్చుపెట్టిన ప్రేమ : భర్తను చంపేసిన లేడీ యూట్యూబర్!!

వీళ్లు మనుషులా.. రాక్షసులా.. రోగిని దొడ్డుకర్రతో చితకబాదారు (Video)

ఏపీలో రేషన్ కార్డు ఈకేవైసీ ఇంకా పూర్తి చేయలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments