Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో నా ఫేవరేట్ హీరో అతనే, 800లో నేను పెట్టిన కండిషన్ అదే : ముత్తయ్య మురళీధరన్

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (18:40 IST)
Muttiah Muralitharan
భాషలకు, దేశాలకు అతీతంగా తన ఆటతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. ఆయన జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800ల వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్ ఆయనే. ఆ రికార్డును గుర్తు చేసేలా టైటిల్ పెట్టారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీ పిక్చర్స్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో అక్టోబర్ 6న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా తెలుగు మీడియాతో ముత్తయ్య మురళీధరన్ ముచ్చటించారు. ఆ విశేషాలు... 
 
మీ జీవితాన్ని తెరకెక్కిస్తామని వచ్చినప్పుడు మీ స్పందన ఏమిటి? లేదంటే మీరే సంప్రదించారా?
ముత్తయ్య మురళీధరన్ : అంతా యాదృశ్చికంగా జరిగింది. నా జీవితాన్ని సినిమా తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. శ్రీలంక ప్రజలకు సహాయం చేయడం కోసం 20 ఏళ్ళ క్రితం నేను ఫౌండేషన్ స్థాపించాను. దాని ద్వారా ఎంతో మందికి సాయం అందించాం. మా సేవా కార్యక్రమాలను గూగుల్ చేసి చూడవచ్చు. దర్శకుడు వెంకట్ ప్రభు 2008లో ఒకసారి తమిళ ప్రజలకు సహాయం చేయడానికి వచ్చారు. అప్పుడు ఆయనతో పాటు శ్రీపతి, ఇంకో ఇద్దరు ఉన్నారు. నా వైఫ్ మదిమలర్, వెంకట్ ప్రభు చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ కావడంతో మమ్మల్ని కలిశారు. నా ట్రోఫీలు, సాధించిన ఘనతలు చూసి బయోపిక్ తీద్దామని ప్రతిపాదన తెచ్చారు. నేను వద్దని చెప్పా. ఫౌండేషన్ కోసం ఏదైనా చేయవచ్చని నా మేనేజర్ కన్వీన్స్ చేశారు. సరే అన్నాను. అప్పుడు శ్రీపతిని కథ రాయమని వెంకట్ ప్రభు చెప్పారు. కొన్ని కారణాల వల్ల వెంకట్ ప్రభు, నిర్మాత సినిమా చేయలేదు. శ్రీపతితో స్క్రిప్ట్ ఫినిష్ చేయమని చెప్పా. తర్వాత విజయ్ సేతుపతి హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ సినిమా చేయాలని ప్లానింగ్ జరిగింది. అప్పుడు ఏమైందో అందరికీ తెలుసు. నాతో పాటు చాలా రోజులు ట్రావెల్ చేసిన, నా గురించి బాగా తెలిసిన, స్క్రిప్ట్ రాసిన శ్రీపతిని డైరెక్ట్ చేయమని చెప్పా. తర్వాత మధుర్ మిట్టల్ వచ్చారు. కరోనా వల్ల కొంత ఆలస్యమైంది. సినిమా పూర్తైన తర్వాత శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ ముందుకు వచ్చారు. నా జీవితంలో ఎత్తుపల్లాలు ఎలా అయితే ఉన్నాయో... ఈ సినిమాను అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించడం వెనుక అదే విధంగా ఎత్తుపల్లాలు ఉన్నాయి.
 
బయోపిక్ అంటే చాలా బాధ్యత ఉంటుంది. యువతకు స్ఫూర్తి ఇచ్చేలా ఉండాలి. ఆ విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
నేను బయోపిక్ తీయడానికి రైట్స్ ఇచ్చాను. స్క్రిప్ట్ నాలుగైదుసార్లు చదివా. ఇందులో ఎటువంటి మసాలా ఉండకూడదని బలంగా నిర్ణయించుకున్నా. ఆ విషయం దర్శక నిర్మాతలకు చెప్పా. సినిమాలో నిజంగా జరిగిన కథ మాత్రమే ఉండాలని దర్శకుడికి షరతు విధించా. నిజమైన కథ లేకపోతే అది బయోపిక్ కాదు. నా జీవితమే సినిమాలా ఉంటుంది. మంచి చెడుతో పాటు చాలా విషయాలు జరిగాయి. మంచి స్క్రిప్ట్ రైటర్ కూడా ఇంత మంచి కథ రాయగలడని అనుకోను.   
 
బయోపిక్ అంటే ఫిక్షన్ యాడ్ చేస్తారు. లేదంటే డాక్యుమెంటరీ అవుతుందని చెబుతారు. ఈ సినిమాలో ఎంత ఫిక్షన్ ఉంది?
నో ఫిక్షన్! ఈ సినిమాలో క్రికెట్ 20 శాతమే ఉంటుంది. మిగతా 80 శాతం అంతా నా లైఫ్ ఉంటుంది. నా ప్రయాణం, నేను ఇన్ని ఘనతలు సాధించిన క్రమంలో నా కుటుంబం, దేశం ఎదుర్కొన్న పరిస్థితులు '800'లో చూపించాం. నా బాల్యం, సెలెక్టర్లు నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు? వంటివి ఎవరికీ తెలియవు. అటువంటి విషయాలు ఎక్కువ ఉంటాయి. 
 
మీ పాత్రకు మధుర్ మిట్టల్ ఎంత వరకు న్యాయం చేశారు?
నిజం చెప్పాలంటే... రెండుసార్లు మాత్రమే అతడిని కలిశా. ట్రైనింగ్ జరిగేటప్పుడు కూడా వెళ్ళలేదు. ఆ బాధ్యత అంతా దర్శకుడు చూసుకున్నారు. నేను ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోలేదు. టీజర్, ట్రైలర్ చూశా. నాలా 70 పర్సెంట్ చేశాడు. లుక్స్ పరంగా 60, 70 పర్సెంట్ మ్యాచ్ చేశాడు. 
 
అదేంటి మీరు సినిమా చూడలేదా?
లేదు. నేను చాలా పెద్ద మూవీ ఫ్యాన్. ఇండియన్ మూవీస్ మిస్ కాను. రషెస్ కంటే మూవీ చూడాలని అనుకున్నా. అప్పుడు మాత్రమే ఎంజాయ్ చేయగలను. 
 
ఎప్పుడూ సెట్ కు వెళ్లలేదా? ఎలా తీస్తున్నారో చూడలేదా?
ఒక్కసారి మాత్రమే వెళ్లా. మా పేరెంట్స్ ఇంటిలో షూటింగ్ చేస్తున్నారు. అప్పుడు నేను ఆ ఇంటికి దగ్గరలో ఉన్నాను. అందుకని, వెళ్లా. మూవీ మేకింగ్ గురించి నాకు ఏమీ తెలియదు. అది డిఫికల్ట్ ఆర్ట్. నాకు సినిమాలు చూడటమే ఇష్టం. కొన్నిసార్లు నిర్మాతలను చూస్తే బాధగా ఉంటుంది. నటీనటులతో పాటు అందరికీ డబ్బులు ఇస్తారు. ఒకవేళ సినిమా ఆడకపోతే వాళ్ళ డబ్బులే పోతాయి కదా! 
 
సినిమా హిట్ కావచ్చు, ఫ్లాప్ అవ్వొచ్చు. అందుకని, చాలా మంది క్రికెటర్లు తమ బయోపిక్ తీయాలని కోరుకోరు!
ఒక్కటి చెబుతా... వజ్రాల కోసం భూమిలో వెతుకుతారు కదా! లోతుగా తవ్వుతారు. చాలా డబ్బులు ఖర్చు పెడతారు. కొన్నిసార్లు ఒక్క వజ్రం మాత్రమే లభిస్తుంది. చాలాసార్లు వజ్రాలు లభించవు. సినిమా కూడా అంతే! విజయంలో చాలా అంశాలు ఉంటాయి. సినిమా ఫ్లాప్ అయితే నా లెగసీ ఏమీ కింద పడదు. నా లెగసీ క్రికెట్! నిజంగా జరిగిన కథను ప్రజలకు చెప్పాలని మేం చేసిన ప్రయత్నం '800'. అది కొందరికి నచ్చవచ్చు. కొందరికి నచ్చకపోవచ్చు. చిత్ర పరిశ్రమలో 35 ఏళ్ళ అనుభవం ఉన్న శివలెంక కృష్ణప్రసాద్ గారు ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రజెంట్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు. ఇదొక మంచి సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. 
 
శ్రీలంకలో సినిమాను విడుదల చేస్తున్నారా?
చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ, సింహళీ భాషల్లో విడుదల అవుతోంది. శ్రీలంక ప్రజల్లో చాలా మంది విదేశాల్లో ఉంటున్నారు. వాళ్ళ కోసం మేం సింహళీ భాషలో కూడా విడుదల చేస్తున్నాం. శ్రీలంకలో సింహళీ వెర్షన్‌ విడుదల చేస్తున్నాం.
 
మీరు తెలుగు సినిమాలు చూస్తారా?
శ్రీలంకలో తెలుగు సినిమాలు విడుదల కావు. తమిళ, హిందీ సినిమాలు విడుదల అవుతాయి. ఆ భాషల్లో డబ్బింగ్ చేసిన తెలుగు సినిమాలు చూస్తాం. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప' సినిమాలను పాన్ ఇండియా రిలీజ్ చేశారు. హిందీ, తమిళ భాషల్లో కూడా విడుదల చేశారు. అవి చూశాం. ఇప్పుడు తెలుగు సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. శ్రీలంకలో బాలీవుడ్ మూవీస్ ఫేమస్. అక్కడ వాళ్ళకు హిందీ తెలుసు. ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగు సినిమా టాప్ పొజిషన్‌కు చేరుకుంది. 
 
మీకు ఇష్టమైన తెలుగు నటుడు?
ఇతర భాషలతో పోలిస్తే తెలుగులో సూపర్ హీరోస్, స్టార్ హీరోస్ ఎక్కువ మంది ఉన్నారు. అయితే... నేను నాని సినిమాలు ఎక్కువ చూశా! 'శ్యామ్ సింగ రాయ్' చూశా. 'ఈగ', 'జెర్సీ'తో పాటు చాలా సినిమాలు చూశా. డబ్బింగ్ సినిమాలు కనుక తెలుగు టైటిల్స్ ఎక్కువ గుర్తు లేవు. ఆయన నటన అంటే ఇష్టం. యాక్షన్ హీరో కాదు... డ్రామా, ఎమోషన్స్ ఉంటాయి. నేచురల్ స్టార్!
 
వెంకట్ ప్రభు, మీ వైఫ్ మదిమలర్ చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ అన్నారు కదా! మీ మామ గారికి తమిళ పరిశ్రమలో చాలా మంది తెలుసు. మీకు వాళ్ళు పరిచయమేనా?
మదిమలర్ తండ్రి రామమూర్తి ఇప్పుడు లేరు. కానీ, ఆయన గురించి చాలా మందికి తెలుసు. చెన్నైలో మలర్ హాస్పిటల్స్ వాళ్ళవే. ఇప్పటికీ షేర్స్ ఉన్నాయి. కార్తీ హీరోగా ఆయన ఒకట్రెండు సినిమాలు నిర్మించారు. 'చంద్రముఖి' దర్శకులు పి. వాసు, రామమూర్తి మంచి స్నేహితులు. అలాగే, చంద్రశేఖర్ కూడా! చంద్రశేఖర్ ద్వారా నాకు మదిమలర్ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. సన్ టీవీ కళానిధి మారన్ గారు, సీఈవో షణ్ముగం, ఇంకా చాలా మంది నాకు పరిచయమే.    
 
సినిమా విడుదలకు ముందు మీకు ఏమనిపిస్తోంది?
ఎప్పటిలా నార్మల్ గా ఉన్నాను. నేను ఎందుకు టెన్షన్ పడాలి? ఒకవేళ నేను వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతుంటే టెన్షన్ పడాలి. 
 
త్వరలో వరల్డ్ కప్ మొదలు కాబోతోంది. మీ ఫేవరేట్ టీమ్ ఏది?
శ్రీలంక మాత్రమే నా ఫేవరేట్. ఇండియన్ టీమ్ క్లియర్ ఫేవరేట్ అని తెలుస్తోంది. ఆస్ట్రేలియా టీమ్ కూడా బావుంది. అయితే... ఎవరు గెలుస్తారనేది ఇప్పుడే చెప్పలేం. విజయం వరించాలంటే అదృష్టం కూడా ఉండాలి. లాస్ట్ వరల్డ్ కప్ న్యూజిలాండ్ విన్ అవుతుందని అనుకున్నారు. లక్కీగా ఇంగ్లాండ్ నెగ్గింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments