Webdunia - Bharat's app for daily news and videos

Install App

#HDBVenkatesh బర్త్‌డే స్పెషల్.. "ఎఫ్-3" కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

Webdunia
ఆదివారం, 13 డిశెంబరు 2020 (13:43 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. ఈయన తన పుట్టినరోజు వేడుకలను ఆదివారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్త చిత్రం "ఎఫ్-3" కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 
 
గతంలో వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్-2' (ఫన్ అండ్ ఫస్ట్రేషన్) చిత్రం రాగా, ఇది సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో ఇపుడు ఈ చిత్రం సీక్వెల్ రానుంది. 
 
ఇందులోకూడా హీరోలుగా వెంకటేష్, వరుణ్ తేజ్‌లు నటిస్తుండగా, హీరోయిన్లుగా తమన్నా, హెబ్బా పటేల్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి హెబ్బా పటేల్ అని పేరు పెట్టారు. ఈ క్రమంలో ఆదివారం రోజు వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి పోస్టర్ విడుదల చేశారు.
 
ఇందులో రెండు ట్రాలీల నిండా వెంకటేశ్, వరుణ్ తేజ్ డబ్బు తీసుకెళ్తున్నారు. పూర్తి స్థాయి కామెడీని పంచుతూ ఎఫ్-3తో మరోసారి హిట్ కొట్టాలని ఈ హీరోలు భావిస్తున్నారు. కాగా, దిల్‌ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
 
కాగా, వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పాటు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఎఫ్-3 కోసం ఎదురు చూస్తున్నామని ట్వీట్లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దారుణం, నాలుగున్నరేళ్ల పాపపై పినతండ్రి అనేకసార్లు అత్యాచారం, తల్లి చంపేసింది

Pawan Kalyan: మన ఊరు - మాట మంతి కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

జాతకం ప్రకారం నాకు ఇద్దరు భార్యలు .. రెండో భార్యవు నీవేనంటూ విద్యార్థినికి టీచర్ వేధింపులు...!!

న్యూఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు-నీతి ఆయోగ్ సమావేశం తర్వాత కుప్పం టూర్

మెదక్ పట్టణంలో 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments