Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాంట్‌ చేస్తున్న అప్ప‌రారాణి, సుధీర్ బాబు ప్రత్యేక గీతం

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (15:19 IST)
Appararani, Sudhir Babu
సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నసినిమా 'హంట్'. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ ప్రధాన పాత్రలు పోషించారు. నేపథ్యంలో రూపొందుతోన్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. సినిమాలో 'పాపతో పైలం...' పాటను విడుదల చేశారు. 
 
'పటాకా సాంగ్ ఆఫ్ ది ఇయర్' అంటూ విడుదల చేసిన 'పాపతో పైలం...'లో సుధీర్ బాబుతో పాటు అప్సరా రాణి స్టెప్పులు వేశారు. 'క్రాక్', 'సీటీమార్' తర్వాత మరోసారి ప్రత్యేక గీతంలో ఆమె సందడి చేశారు. ఇందులో సుధీర్ బాబు, అప్సరా రాణితో పాటు శ్రీకాంత్, భరత్ కూడా డ్యాన్స్ చేశారు. ఈ పాటకు యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. జిబ్రాన్ సంగీతం అందించగా... మంగ్లీ, 'పుష్ప' ఫేమ్ ('ఏ బిడ్డా ఇది నా అడ్డా...' పాడిన) నకాష్ అజీజ్ ఆలపించారు.   
 
ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. విడుదలైన కొన్ని క్షణాల్లో ఈ పాట వైరల్ అయ్యింది.  విజువల్స్ చూస్తే పబ్‌లో ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా రిచ్‌గా షూట్ చేసినట్లు అర్థం అవుతోంది.   
 
ఈ సందర్భంగా చిత్రనిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ "సినిమాలో రెండు పాటలు ఉన్నాయి. ఈ రోజు 'పాపతో పైలం' విడుదల చేశాం. దీనికి మంచి స్పందన లభిస్తోంది. సుధీర్ బాబు ఎనర్జీగా, స్టైలుగా డ్యాన్స్ చేశారని, సాంగ్ బావుందని ఆడియన్స్ చెబుతున్నారు. ఇదొక స్టైలిష్ అండ్ హై  వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్ పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేశారు. ఆల్రెడీ విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని చెప్పారు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

వైకాపా నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత జేసీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments