'జీవితంలో ఎక్కడ గెలిచినా చావు దగ్గర ఓడిపోవాలసిందే' : ఇంట్రెస్టింగ్‌గా 'హత్య' ట్రైలర్

Webdunia
మంగళవారం, 18 జులై 2023 (20:12 IST)
'జీవితంలో ఎక్కడ గెలిచినా చావు దగ్గర ఓడిపోవాలసిందే' అంటూ "హత్య" ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తాజా చిత్రం "హత్య". తన కెరియర్ ఆరంభం నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆలరిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆయన నటించి, దర్శకత్వం వహించిన "బిచ్చగాడు-2" చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఇపుడు "హత్య" పేరుతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ పోస్టరుతోనే అమితాసక్తిని రేకెత్తించారు. 
 
బాలాజీ కుమార్ దర్శకత్వంలో వహించిన ఈ సినమాలో ఆయన డిటెక్టివ్‌గా కనిపించనున్నాడు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ చిత్రం నుంచి మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. "జీవితంలో ఎక్కడ గెలిచినా చావు దగ్గర ఓడిపోవాలసిందే" అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్ అవుతోంది.
 
లైనా అనే ఒక మోడల్ హత్య చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. పోలీసులకు కూడా సాధ్యం కాని ఈ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి హీరో రంగంలోకి దిగుతాడు. ఇందులో రితికా సింగ్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. మురళీ శర్మ, రాధికా శరత్ కుమార్‌కు కీలకమైన పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

సీబీఐ కేసును కొట్టివేయాలి.. వై. శ్రీలక్ష్మి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు రిజర్వ్

ప్రకాశం జిల్లాలో కంపించిన భూమి.. రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలు

Revanth Reddy: ఒకే వేదికపై రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ.. రేవంత్ ప్లాన్ సక్సెస్ అవుతుందా?

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments