Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఆర్ రెహ్మాన్‌కు చెక్ పెట్టిన అనిరుధ్ రవిచందర్.. నో టైమ్ అంటూ..?

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (18:31 IST)
హిట్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పెద్ద స్టార్‌గా, స్టార్ టెక్నీషియన్‌గా ఎదిగాడు. ఆయన సంగీతం సమకూర్చిన సినిమాలు బంపర్ హిట్ అవుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ ఒక సినిమాలో కనీసం ఒక వైరల్ పాటని అందించడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. తన రివర్టింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమాపై హైప్ పెంచేస్తున్నాడు.  
 
అందుకు మంచి ఉదాహరణ రజనీకాంత్ "జైలర్". సినిమా హైప్ రావడానికి "కావాలా" పాట కీలకపాత్ర పోషించింది. సినిమాలో అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తిగా భిన్నమైన స్థాయిలో ఉంటుంది. చెన్నైకి చెందిన సంగీత స్వరకర్త అనిరుధ్ తమిళ చిత్ర పరిశ్రమ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ రెండింటిలోనూ బ్లాక్ బస్టర్లు సాధించాడు. 
 
ఇకపోతే.. షారుఖ్ ఖాన్ "జవాన్"లో తన బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడు. ఎన్టీఆర్ రాబోయే "దేవర"కి సంగీతం అందించనున్న అనిరుధ్ తన చేతిలో తగినంత సమయం లేనందున రెండు పెద్ద తెలుగు చిత్రాలను తిరస్కరించాడు. 
 
అంతేగాకుండా ఆస్కార్ అవార్డు గ్రహీత రెహమాన్ పాపులారిటీ, జీతంను అనిరుధ్ రవిచందర్ అధిగమించాడు. ఈ యంగ్ కంపోజర్ తన పారితోషికంగా ఒక్కో సినిమాకు రూ.8-10 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఆ విధంగా, అతను భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే సంగీత స్వరకర్తగా మారిపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

ACP: హీరోయిజం ఇంట్లో.. బయటకాదు.. ఓవర్ చేస్తే తోక కట్ చేస్తాం: ఏసీపీ (Video)

Telangana: 14 ఏళ్ల బాలిక స్కూల్ బిల్డింగ్ నుంచి పడిపోయింది.. చివరికి?

Telangana: భార్య తెలియకుండా రుణం తీసుకుందని భర్త ఆత్మహత్య

Allu Arjun Arrested: ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్.. ఇంటర్వెల్ వరకు కూర్చునే వున్నారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments