Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ స్టార్ డైరెక్టర్‌తో మహేష్ బాబు సినిమా..!

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (23:00 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ డైరెక్టర్‌తో మహేష్‌ బాబు సినిమా చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరా పవర్ స్టార్ డైరెక్టర్ అంటారా..? హరీష్ శంకర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా చూడాలనుకుంటారో.. అలా చూపించారు. అది అభిమానులకే కాకుండా కామన్ ఆడియన్‌కి కూడా బాగా కనెక్ట్ అయ్యింది. 
 
అందుకే గబ్బర్ సింగ్ బాక్సాపీస్ వద్ద బ్లాక్‌బస్టర్ అయ్యింది. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ హరీష్‌ శంకర్ మరోసారి పవన్‌తో సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నారు. అది ఇప్పుడు నెరవేరే రోజు వచ్చింది. వకీల్ సాబ్ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్‌ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. వకీల్ సాబ్ తర్వాత క్రిష్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాని ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. 
 
ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్‌తో సినిమా చేస్తున్నట్టు ఎనౌన్స్ చేసారు. ఈ సంవత్సరం ఎండింగ్‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు ప్లాన్ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. హరీష్ శంకర్ ఓ వైపు పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన వర్క్ చేస్తూనే మరో వైపు మహేష్ బాబు కోసం కథ రెడీ చేస్తున్నాడని తెలిసింది. హీరోని పవర్‌ఫుల్‌గా ఎంటర్టైనింగ్‌గా ఎలా చూపించాలో హరీష్‌ శంకర్‌కి బాగా తెలుసు. మరి.. అన్నీ అనుకున్నట్టు జరిగి మహేష్‌‌తో సినిమా చేసే ఛాన్స్ వస్తే.. మహేష్‌ని ఎలా చూపిస్తాడో అనేది ఆసక్తిగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments