హరిహర వీరమల్లు విడుదలకు సిధ్ధమవుతోంది - డబ్బింగ్ షురూ

దేవీ
శుక్రవారం, 21 మార్చి 2025 (15:52 IST)
Dubbing poster
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ ఎప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఉపముఖ్యమంత్రిగా వుండడంతో పవన్ కళ్యాణ్ కొంత షూట్ ఆలస్యం అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మిగిలిన వర్క్ ను పూర్తి చేసే పనిలో వున్నారు. ఇప్పటికే మే 9న సినిమా థియేటర్ లో విడుదలచేస్తున్నట్లు ప్రకటించారు. అందుకే నేడు పోస్ట్ ప్రొడక్షన్ లో భాగంగా డబ్బింగ్ పనులు ప్రారంభించినట్లు నిర్మాత వెల్లడించారు.
 
ఈ చిత్రం డబ్బింగ్ పనులు ఇపుడు స్టార్ట్ చేసేసినట్టుగా మేకర్స్  సోషల్ మీడియాలో తెలుపుతూ, ఫుల్ స్వింగ్ లో ఈ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యకథగా ఇప్పటికే చెప్పేశారు. నిధి అగర్వాల్ నాయికగా నటించిన ఈ చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకుడు.  ఏఎమ్ రత్నం నిర్మాత. డియోల్, సత్యరాజ్, అగర్వాల్ నిధి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం కీరవాణి స్వరకర్త.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments