పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం "హరిహర వీరమల్లు". ఈ నెల 24వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. క్రిష్, జ్యోతికృష్ణలు దర్శకులు. నిధి అగర్వాల్ హీరోయిన్. ఏఎం రత్నం నిర్మాత. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటన, యాక్షన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీని మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించింది.
ఇందులో భాగంగా పెంచిన టిక్కెట్ ధరలను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 28వ తేదీ నుంచి సాధారణ ధరలకే వీరమల్లు టిక్కెట్లు లభించనున్నాయి. బుక్ మై షో, డిస్ట్రిక్ యాప్‌లలలో ఇప్పటికే ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. సినిమా విడుదల సందర్భంగా సింగిల్ స్క్రీన్, మల్టీ ప్లెక్స్‌లలో టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఈ క్రమంలో సోమవారం నుంచి ఎలాంటి పెంపు లేకుండా సాధారణ టిక్కెట్ ధరలకే టిక్కెట్లు విక్రయిస్తున్నారు. సింగిల్ స్క్రీన్‌లలో బాల్కనీ రూ.175, మల్టీప్లెక్స్‌లలో రూ295కే టిక్కెట్లు లభించనున్నాయి.