Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్త్ డే హ్యాష్‌ట్యాగ్‌లతో పవన్ కల్యాణ్ నెంబర్ వన్.. రెండో స్థానంలో ప్రభాస్...

సోషల్ మీడియా పుణ్యమాని సినీ తారలు తమ ఫ్యాన్స్‌తో టచ్‌లో వున్న సంగతి తెలిసిందే. తమ తమ ఫ్యాన్స్‌కు తమ సినిమాల గురించి, వ్యక్తిగత వివరాల గురించి అప్ డేట్స్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో సినీ తారల క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. ఈ నేప

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (13:15 IST)
సోషల్ మీడియా పుణ్యమాని సినీ తారలు తమ ఫ్యాన్స్‌తో టచ్‌లో వున్న సంగతి తెలిసిందే. తమ తమ ఫ్యాన్స్‌కు తమ సినిమాల గురించి, వ్యక్తిగత వివరాల గురించి అప్ డేట్స్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో సినీ తారల క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ట్రెండింగ్స్‌లో  టాలీవుడ్ అగ్ర హీరోలు పోటీపడుతున్నారు. 
 
ఇందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ హ్యాష్‌ట్యాగ్‌లో అగ్రస్థానంలో వుండగా, యంగ్ టైగర్ హ్యాష్ ట్యాగ్స్‌‌తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్న అభిమానులు అగ్రస్థానంలో పవన్ కల్యాణ్, తరువాత ప్రభాస్, మూడో స్థానంలో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ నాలుగో స్థానంలో నిలిచారు.
 
సోషల్ మీడియాలో ట్రెండింగ్ లెక్కించే సంస్థ మాత్రం పవర్ స్టార్ తరువాతి స్థానాన్ని ప్రభాస్‌కి అప్పగించింది. హీరోల పుట్టిన రోజు సందర్భంగా హ్యాష్ ట్యాగ్‌లు రూపొందించి, విషెస్ చెప్పడం సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. ఈ విధానం హాలీవుడ్, బాలీవుడ్‌ తరహాలో టాలీవుడ్‌కి కూడా పాకింది.
 
ఈ నేపథ్యంలో #HBDLEADERPAWANKALYAN అనే హ్యాష్ ట్యాగ్‌, #HBDDARLINGPRABHAS హ్యాష్ ట్యాగ్‌, #HBDMAHESHBABU హ్యాష్‌ ట్యాగ్‌, #HAPPYBIRTHDAYNTR హ్యాష్ ట్యాగ్‌లతో పవన్ కల్యాణ్ 2.9 మిలియన్ల ట్వీట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో 2.1 మిలియిన్ల శుభాకాంక్షల ట్వీట్స్‌తో ప్రభాస్‌ నిలిచాడని ట్రెండింగ్ లెక్కించే సంస్థ తెలిపింది. 1.1 మిలియన్ విషెస్ ట్వీట్స్‌తో మహేష్ బాబు మూడోస్థానంలో నిలవగా, 7 లక్షల ట్వీట్స్‌తో జూనియర్ ఎన్టీఆర్ నాలుగో స్థానంలో నిలిచాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments