Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నాలుగు గంటల్లో ఏం జరిగింది? జూలైలోహ్యాపీ బర్త్ డే

Webdunia
శనివారం, 28 మే 2016 (10:52 IST)
చెన్నమనేని శ్రీధర్‌, జ్యోతిసేతీ, సంజన, శ్రవణ్‌ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. శ్రీనందన్‌ మూవీస్‌ పతాకంపై మహేష్‌ కల్లే నిర్మిస్తున్నారు. పల్లెల వీరారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. పుట్టినరోజు వేడుక నేపథ్యంలో ఒకే ఇంట్లో సాగే కథ ఇది. సాయంత్రం 7 నుంచి 12 గంటలు.. ఈ నాలుగు గంటల్లో ఏం జరిగిందనేది ఆసక్తికరం. హారర్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో 15 నిముషాల గ్రాఫిక్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. 
 
నిర్మాత తెలుపుతూ... హారర్‌ సినిమా కథల్లో దర్శకుడు కొత్త కథను వినిపించారు. కథ, కథనం ఆసక్తికరంగా వుంటాయి. వైజాగ్‌, హైదరాబాద్‌లో చిత్రీకరణ చేశాం. కీలకమైన సన్నివేశాలు కొన్నింటిని విదేశాల్లో చిత్రించాం. ప్రస్తుతం రీరికార్డింగ్‌ జరుగుతుంది. డి.ఐ. పూర్తయ్యాక తొలికాపీ సిద్ధమవుతుంది. జులైలో సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వాసిరెడ్డి సత్యానంద్‌, సంగీతం: సంతోష్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కోటేశ్వరరావు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments