Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హ్యాపీ బర్త్‌డే'లో ఆ రాత్రి ఆ నాలుగు గంటల్లో ఏం జరిగింది?

Webdunia
శనివారం, 11 జూన్ 2016 (20:49 IST)
చెన్నమనేని శ్రీధర్‌, జ్యోతీసేథీ, సంజన, శ్రవణ్‌ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. శ్రీనందన్‌ మూవీస్‌ పతాకంపై మహేష్‌ కల్లే నిర్మిస్తున్నారు. పల్లెల వీరారెడ్డి(చే గువేరా) దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తైంది. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ''కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రాసిన కథ ఇది. ఒకే ఇంట్లో ఓ జంటకు ఎదురైన సంఘటనల సమాహారమే 'హ్యపీ బర్త్‌డే' సినిమా. రాత్రి 8 నుంచి 12 గంటల మధ్య సమయంలో ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. హారర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో 15 నిమిషాల గ్రాఫిక్స్‌ హైలైట్‌గా నిలుస్తాయి'' అని అన్నారు. 
 
నిర్మాత మహేష్‌ కల్లే మాట్లాడుతూ ''హారర్‌ జోనర్‌లో సరికొత్త కథ వినిపించారు దర్శకుడు. అందుకే వెంటనే అంగీకరించాను. కథ, కథనం ఆసక్తికరంగా ఉంటాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగే చిత్రమిది. మేజర్‌ పార్ట్‌ అంతా హైదరాబాద్‌, వైజాగ్‌ ప్రాంతాల్లో తెరకెక్కించాం. కొన్ని కీలక సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యకమ్రాలు శరవేగంగా జరుగుతున్నాయి. విఎఫ్‌ఎక్స్‌ పనులు పూర్తయ్యాయి. త్వరలో పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments