Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాజల్ అగర్వాల్‌‌ బర్త్ డేకు రానా స్పెషల్ గిఫ్ట్- కళ్లకు గంతలు కట్టి ఆభరణాలు తొడిగాడు.. (వీడియో)

చందమామ హీరోయిన్, టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్‌కు జూన్ 19వ తేదీ పుట్టిన రోజు. ఈ రోజున రానా దగ్గుబాటి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. నిజమే. రానా కాజల్ అగర్వాల్‌కు గంతలు కట్టి ఆభరణాలు తొడిగాడు

Webdunia
సోమవారం, 19 జూన్ 2017 (17:38 IST)
చందమామ హీరోయిన్, టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్‌కు జూన్ 19వ తేదీ పుట్టిన రోజు. ఈ రోజున రానా దగ్గుబాటి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. నిజమే. రానా కాజల్ అగర్వాల్‌కు గంతలు కట్టి ఆభరణాలు తొడిగాడు. ఇదేదో రియల్ సీన్ కాదు.. రీల్ సీన్‌లో. ఇంతకీ విషయం ఏమిటంటే? కాజల్ అగర్వాల్ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆమె నటిస్తున్న ''నేనే రాజు నేనే మంత్రి'' సినిమా నుంచి ఓ ప్రత్యేక టీజర్‌ను విడుదల చేశారు. 
 
ఈ సినిమాలో హీరోగా న‌టిస్తోన్న రానా.. ఈ టీజ‌ర్‌లో కాజల్‌ కళ్లకు గంతలు కట్టి ఆభరణాలు వేస్తాడు. అనంత‌రం ఆమె కళ్లకు క‌ట్టిన గంత‌లు తీసి దీపాల‌తో వెలిగిపోతున్న భ‌వ‌నంలోకి తీసుకెళ‌తాడు. ‘నా పేరు రాధా జోగేంద్ర. రాధ లేనిదే జోగేంద్ర లేడు’ అని రానా ఓ డైలాగ్ చెప్తాడు. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
కాగా తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ లక్ష్మీ కల్యాణం సినిమాతో కాజ‌ల్ అగర్వాల్ టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ నటించే ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం ఆమెకు 50వ సినిమా కావడం.. ఆ సినిమాకు తేజానే దర్శకత్వం వహించడం విశేషం.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments