Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుర్రహీరోను తాబేలు అనుకొని పొరపడిన పెద్ద హీరోలు - స్పెషల్ స్టోరీ

డీవీ
మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (13:14 IST)
Hanuman teja sajja
సినిమారంగంలో కొత్త తరం కు అగ్రహీరోల మధ్య పోటీ అనేది అనివార్యం. ఒకప్పుడు పెద్దహీరోల సినిమాలు విడులయితే కొత్తగా వచ్చే హీరోల సినిమాలకు థియేటర్లు దొరికేవి కావు. దొరికినా నామ్ కే వాస్తే. ఊరవతలనో, పెద్దగా పేరు లేని థియేటర్లలో సినిమాలు ప్రదర్శించేవారు. చిన్న హీరోల సినిమాలంటే పెద్ద హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు అలుసే. ఒక రకంగా చెప్పాలంటే తాబేలు, కుందేలు కథ సరిగా సరిపోతుంది. 
 
ఒకప్పుడు మెగాస్టార్ సినిమా విడుదల రోజే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీడేస్ సినిమా రిలీజైంది. ఆ సినిమాకు థియేటర్లు కూడా పెద్దగా దొరకలేదు. సినేను  రిలీజ్ చేసే వారు దొరకలేదు. ఇక చేసేదిలేక శేఖర్ కమ్ముల తానే రిలీజ్ చేసుకున్నాడు. దాంతే పెద్దగా సినిమా హాల్స్ దొరకలేదు. తాగాజా ఈ సంక్రాంతికి హనుమాన్ కు అదే  రిపీట్  అయింది. 
 
హ్యాపీ డేస్ ను   హైదరాబాద్  క్రాస్ రోడ్ కు దూరంగా ముషీరాబాద్ లో ఓ థియేటర్ లో శేఖర్ కమ్ముల సినిమా ప్రదర్శించారు. మొదటి రోజు బాగానే వుంది అనే టాక్ రానురాను యూత్ బాగా కనెక్ట్ అవడంతోపాటు తల్లిదండ్రులు కూడా తన కుమారులను వారిలో చూసుకునేలా పీలయ్యారు. దాంతో అది పెద్ద హిట్. హ్యాపీడేస్ లో పెద్ద తారాగణమేమీలేదు. ఇక చిరంజీవి సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
 
కాలంమారుతున్నా సినిమారంగంలో పరిస్థితులు కూడా పెద్దగా ఏమీ మారలేదు. సంక్రాంతి వచ్చిందంటేచాలు అగ్ర హీరోలు, అగ్ర దర్శకులు అగ్ర నిర్మాణ సంస్థల సినిమాలు ముందుంటాయి. ఈ ఏడాది సంక్రాంతి కూడా అదే జరిగింది. ఎప్పటినుంచో తమ సినిమా విడుదలంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమా హనుమాన్ ప్రకటించారు. పైగా అధి పాన్ ఇండియాలో లెవల్లో ప్లాన్ చేశారు. బాలీవుడ్ లోనూ ఇతర భాషల్లోనూ, ఓవర్ సీస్ లోనూ హనుమాన్ కు సంబంధించి ఔట్ పుట్ రెడీ అయింది. ఇక తెలుగులో విడుదలకు సన్నాహాలు చేస్తుండగా థియేటర్ల సమస్య అంటూ సినిమాను వాయిదా వేసుకోమని  నిర్మాతకు పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు ట్విస్ట్ ఇచ్చారు. థియేటర్లు ఇవ్వండి బాబోయ్ అని హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి ఫిలింఛాంబర్ లోనూ, నిర్మాతల మండలిలోనూ వేడుకున్నారు. ఓ దశలో సినిమా తెలుగులో ఆపేయాలా? అనే డైలమాలో వున్నా, అన్నింటికి హనుమంతుడు వున్నాడంటూ దేవుడిపై భారం వేశారు. 
 
దీనికి కారణం హనుమాన్ హీరో అప్ కమింగ్ నటుడు తేజ సజ్జా. ఇక అదేరోజు మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, విక్టరీ వెంకటేష్ నటించిన సైంథవ్ లు విడుదలకు సిద్ధంగా వున్నాయి. దానికితోడు షడెన్ గా అక్కినేని నాగార్జున కూడా తానూ వున్నానని నా సామిరంగా అంటూ ముందుకు వచ్చాడు. మరో అగ్ర హీరో రవితేజ సినిమా కూడా విడుదల కావాల్సింది. కానీ సినీ పెద్దలు పంాయితీ చేయడంతో రవితేజ ఫిబ్రవరికి వెళ్ళారు. ఇక ఆ తర్వాత హనుమాన్ వున్న కొద్దిపాటిథియేటర్లలో సరిపెట్టుకుని ధైర్యంగా బరిలో దిగింది. 
 
అంతే.. హనుమాన్  సినిమా రికార్డ్ లు బద్దలు కొట్టేసింది. ఊహించని విధంగా ఉత్తరాదిలో రామాలయం నిర్మాణం కూడా కొలిక్కి రావడంతో అక్కడ హనుమాన్ కు కలిసివచ్చింది. దాంతో ఒక్కసారిగా వందల క్లబ్ లోకి కుర్రహీరో తేజ్ సజ్జ చేరాడు. ఇక అదే రోజు విడుదలైన గుంటూరు కారం, నా సామిరంగా, సైంథవ్.. టాప్ హీరోలు, అనుభవం వున్న వారసులు నటించినా  ఎవరికీ వంద రోజులు పోస్టర్ పడలేదు. కానీ రోజువారీ కలెక్లన్లు ఇలా వున్నాయంటూ గుంటూరు కారం రిపోర్ట్ ను నిర్మాతలు సోషల్ మీడియాలో గుమ్మరించారు. 
 
వీటన్నింటికీ కారణం చూస్తే కుర్ర హీరో అయినా విజన్ వున్న దర్శకుడు ప్రశాంత్ వర్మతోపాటు కథలో కొత్తదనంతో అపోజిషన్ లో పెద్ద హీరోలు వున్నా తట్టుకుని 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది, ఈ రేంజ్ చిత్రానికి ఇది హ్యూజ్ ఫీట్. పెద్ద సినిమాలకు కూడా దక్కని100 రోజులు హను-మాన్ కు దక్కిందనీ,  మంచి సెంటర్లలో ఈ మైలురాయిని చేరుకుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ ఫాంటసీ అడ్వెంచర్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మార్కును వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
 
కాగా, హనుమాన్ సినిమా కొద్దిరోజుల్లో బుల్లితెరపై కూడా రానునుంది. అయినా వందరోజుల సందర్భంగా ఈ సినిమాను మంగళవారంనాడు పెద్ద థియేటర్లలో ప్రదర్శించడంతో దానికి స్పందన చూసి నిర్మాత ఆశ్చర్యపోయారు. త్వరలో గ్రాండ్ గా మరో వేడుక చేస్తామని ప్రకటించారు. ఈ ఆనందంతో ఇప్పుడు హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ కూడా సెట్ పైకి రాబోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసిన పవన్ కల్యాణ్..! (video)

ప్రెజర్ వున్నా భారీగా వర్కౌట్లు.. గుండెపోటుతో జిమ్ మాస్టర్ మృతి (video)

బోరుగడ్డ టీ అడిగితే రెడీ, కుర్చీ కావాలంటే సిద్ధం, కాలక్షేపానికి కబుర్లు కూడా: మరో అధికారిపై వేటు (video)

అమ్మాయికి మెసేజ్ చేసిన యువకుడిపై దాడి.. వారిలో ఒక్కడికి యాక్సిడెంట్.. కర్మంటే ఇదే!

మొబైల్ హంట్ సర్వీసెస్: రూ.1.5కోట్ల విలువైన 700 మొబైల్ ఫోన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments