Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలెక్షన్లను కుమ్మేస్తున్న హనుమాన్ ... 25 రోజుల్లో రూ.300 కోట్లు

ఠాగూర్
మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (13:02 IST)
తేజ సజ్జా - ప్రశాంత వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "హనుమాన్". సంక్రాంతి సందర్భంగా గత నెల 12వ తేదీన విడుదలైంది. ఆధ్యాత్మిక అంశాలను టచ్ చేస్తూ ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందించారు. ఫలితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతంచేసుకుంది. దీంతో గత 25 రోజుల్లో ఏకంగా రూ.300 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. సోమవారం 25 రోజులను పూర్తి చేసుకుని, రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతుంది. 
 
ఇటీవలికాలంలో హీరోలు, దర్శకుల కంటే కంటెంట్ బాగున్న చిత్రాలకు ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. అలాంటి ఒక ట్రెండ్ కారణంగానే ఈ మధ్యకాలంలో వచ్చిన పలు చిన్న చిత్రాలు సైతం పెద్ద విజయాలను సొంతం చేసుకున్నాయి. ఆ జాబితాలోనే "హనుమాన్" కూడా చేరిపోయింది. హీరోగా ఒకటి రెండు చిత్రాల్లో నటించిన తేజ సజ్జాకు 'హనుమాన్' ఏకంగా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. భవిష్యత్‌లో ఈ తరహా స్థాయి విజయం ఆయన ఖాతాలో వస్తుందని కూడా చెప్పలేం. 
 
జనవరి 12వ తేదీన విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఆ తర్వాత 25 రోజుల్లో ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని అధికారంగా వెల్లడిస్తూ ఈ సినిమా బృందం అధికారిక పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేసింది. పాయింట్ చిన్నదే అయినా దానిని ఇంట్రెస్టింగ్‌గా చెబితే పాన్ ఇండియా స్థాయిలో దూసుకునిపోతుందనే సత్యాన్ని హనుమాన్ నిరూపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments