Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెన్సార్ పూర్తి చేసుకుని సంక్రాంతికి తగ్గేదేలే అన్నట్లు హను-మాన్ రాబోతుంది

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2023 (10:35 IST)
Hanuma action
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. తేజ సజ్జ కథానాయకుడిగా నటిస్తున్న ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో నేషనల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది.
 
సంక్రాంతికి విడుదలౌతున్న చిత్రాలలో ఒక క్రేజీ చిత్రంగా వస్తున్న 'హనుమాన్' తాజాగా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. 'హనుమాన్ విజువల్ గా అద్భుతంగా వుంది. ఎమోషన్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి. కంటెంట్ చాలా మెస్మరైజింగా వుంది'' అని చిత్ర యూనిట్ ని సెన్సార్ సభ్యులు అభినందించారు. హను-మాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలౌతుంది.          
 
ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్ గా కనిపించనున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
 
 గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ త్రయం ఈ చిత్రానికి చార్ట్ బస్టర్ ఆల్బం అందించారు. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. శివేంద్ర సినిమాటోగ్రఫీ, శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ నెక్స్ట్ లెవల్ లో ఆకట్టుకున్నాయి.  
 
హను-మాన్  తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్,  జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌ విడుదల కానుంది.
 
తారాగణం: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురం పలావ్స్ అండ్ బిర్యానీస్, హైదరాబాదులో హోటళ్లు ప్రారంభం

దేశంలోకి ముందుగానే నైరుతి రుతుపవనాలు.. ఎక్కువ వర్షపాతం నమోదు

హత్రాస్‌ జిల్లాలో తొక్కిసలాట- 80కి చేరిన మృతుల సంఖ్య

రైతు ఆత్మహత్య.. సీరియస్‌గా తీసుకున్న సీఎం.. రూ.25లక్షలు డిమాండ్

కుమార్తెను గర్భవతిని చేసిన కిరాతక తండ్రికి 101 యేళ్ళ జైలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments