Webdunia - Bharat's app for daily news and videos

Install App

105 మినిట్స్ చిత్రం నుంచి హన్సిక స్పెషల్ పోస్టర్

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (17:11 IST)
Hansika
హన్సిక మోట్వాని ప్రధాన పాత్ర లో రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై ఒకే పాత్రతో సింగిల్ షాట్ ఫార్మేట్ లో నిర్మించిన చిత్రం  "105 మినిట్స్"  బొమ్మక్ శివ నిర్మాణంలో దర్శకుడు రాజు దుస్సా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రయోగాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం మేకింగ్ పరంగా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయబోతోంది. మంగళవారం హీరోయిన్ హన్సిక మోట్వానీ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ డిజైన్ కొత్తగా ఉండి ఆకట్టుకుంటోంది. మరికొద్ది రోజుల్లో చిత్ర టీజర్ ను విడుదల చేయబోతున్నారు. 
 
ఈ సందర్భంగా  దర్శకుడు రాజు దుస్సా మాట్లాడుతూ... మా హీరోయిన్ హన్సిక గారికి టీమ్ అందరి తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాం. ఆమె బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశాం. ఈ పోస్టర్ కు మంచి స్పందన వస్తోంది. త్వరలో టీజర్, ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాలు ఉంటాయి. వైవిధ్యభరితమైన కథా కథనాలతో "105 మినిట్స్"  చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మేకింగ్ పరంగా సింగిల్ షాట్ ప్రయోగం చేశాం. సినిమాను చిత్రీకరించిన తీరు మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకే పాత్రతో సాగే ఈ సినిమాలో హన్సిక నటన మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. త్వరలో "105 మినిట్స్"  సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నాం. అన్నారు. 
ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ - బ్రహ్మ, సినిమాటోగ్రఫీ - దుర్గా కిషోర్, సంగీతం - సామ్ సీఎస్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల

పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్!!

తప్పు చేశా.. ఇకపై బెట్టింగులకు ప్రమోట్ చేయను : శ్యామల

నల్గొండలో టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ - 11 మంది అరెస్టు

Pawan Kalyan: తమిళనాడులో జనసేన ఏర్పాటు.. స్టాలిన్‌ను కొనియాడిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments