Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీతోనే నేను సినిమా నుంచి గురుః బ్ర‌హ్మ గురుః విష్ణు.. సాంగ్ విడుదల

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (17:36 IST)
Neeto nenu
‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వ‌శిష్ట హీరోగా మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు  హీరోయిన్లుగా శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అంజిరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘నీతోనే నేను’. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ నుంచి ఉపాధ్యాయుల దినోత్సవం (టీచ‌ర్స్ డే) సందర్భంగా ‘గురుః బ్ర‌హ్మ గురుః విష్ణు..’ లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. గొప్ప స‌మాజం రూప క‌ల్ప‌న‌లో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీల‌కం. అందుక‌నే వారిని బ్ర‌హ్మ‌, విష్ణు, మ‌హేశ్వ‌రుల‌తో పోలుస్తుంటారు. అలాంటి టీచ‌ర్స్‌కు అంకిత‌మిచ్చేలా ‘గురుః బ్ర‌హ్మ గురుః విష్ణు..’ పాట‌ను రూపొందించారు. ప్ర‌ముఖ సింగ‌ర్ మ‌నో పాడిన ఈ పాట‌ను స్టార్ రైట‌ర్ సుద్ధాల అశోక్ తేజ రాశారు.
 
చిత్ర నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మంచి సమాజం కావాలంటే మనకు గొప్ప ఉపాధ్యాయులు కావాలి. టీచ‌ర్స్ వ‌ల్లే అది సాధ్య‌మ‌వుతుంది. అలాంటి వారి గొప్ప‌తనాన్ని తెలియ‌జేసేలా మా సినిమాలో ‘గురుః బ్ర‌హ్మ గురుః విష్ణు..’ పాట ఉంది. ప్ర‌ముఖ సింగ‌ర్ మ‌నో, రైట‌ర్ సుద్ధాల అశోక్ తేజ‌గారు రాసిన ఈ పాట‌ను టీచ‌ర్స్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌టం ఎంతో ఆనందంగా ఉంది. మంచి టీమ్ స‌పోర్ట్‌తో సినిమాను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నాం. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేశాను. రామ్ అనే పాత్ర కూడా గవర్నమెంట్ టీచర్. అందులోని లోపాలను సరిదిద్దేక్రమంలో జరిగే కథే ‘నీతోనే నేను’.  హీరో వికాస్, హీరోయిన్లు మోక్ష, కుషి అందరికీ థాంక్స్. . త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తాం. కార్తీక్ గారి సంగీతం అద్భుతంగా ఉంటుంది. మా సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని అన్నారు.
 
డైరెక్టర్ అంజి రామ్ మాట్లాడుతూ ‘‘టీచర్స్ డే సందర్బంగా మా సినిమా నుంచి ‘గురుః బ్ర‌హ్మ గురుః విష్ణు..’ పాటను విడుదల చేయటం ఆనందంగా ఉంది. సుద్ధాల అశోక్ తేజ‌గారు రాసిన ఈ పాట‌ను మ‌నోగారు అద్భుతంగా పాడారు. పాట అంద‌రికీ న‌చ్చుతుంది’’ అన్నారు. 
 
న‌టీనటులు: వికాస్ వ‌శిష్ట‌, మోక్ష‌, కుషిత, అకెళ్ల త‌దిత‌రులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దాడికి దిగితే అణు యుద్ధమే : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్

రెచ్చగొడితే అణ్వాయుధాలను ఉపయోగిస్తాం.. కిమ్ హెచ్చరిక

2025 డిసెంబర్ నాటికి బందర్ పోర్టు పనులు పూర్తి - చంద్రబాబు

బ్రహ్మోత్సవాలు.. లక్షలాది మంది యాత్రికుల కోసం 1,930 ట్రిప్పులు

సమంత విడాకుల అంశంలో నా మాటలు తప్పే.. కానీ.. : మంత్రి కొండా సురేఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments