Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ కారుపై మూత్ర విసర్జన.. కేసు పెట్టిన మోనల్.. ఎక్కడ?

దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు సంబంధించి ప్రచారం జరుగుతుంటే.. ఓ హీరోయిన్ కారుపై ఓ వ్యక్తి పాడు పనిచేశాడు. ఇంతకీ ఏం చేశాడంటే.. ఓ షాపింగ్ మాల్ వద్ద నిల్చున్న కారుపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (14:22 IST)
దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు సంబంధించి ప్రచారం జరుగుతుంటే.. ఓ హీరోయిన్ కారుపై ఓ వ్యక్తి పాడు పనిచేశాడు. ఇంతకీ ఏం చేశాడంటే.. ఓ షాపింగ్ మాల్ వద్ద నిల్చున్న కారుపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటనపై హీరోయిన్ మోనల్ గజ్జర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన మోనల్ గజ్జల్ టాలీవుడ్ సినిమాలైన వెన్నెల వన్ బై టూ, సుడిగాడు, బ్రదరాఫ్ బొమ్మాళీ వంటి సినిమాల్లో నటించింది. ఈమె తన ఫ్రెండ్స్‌తో కలిసి అహ్మదాబాద్ అంబావాడీ ప్రాంతంలో ఉన్న ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లంది. మాల్ ఎదుట ఉన్న ప్రదేశంలో కారును పార్క్ చేసింది. కానీ షాపింగ్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చి చూసేసరికి షాక్ అయ్యింది. 
 
ఓ వ్యక్తి తన కారు టైరుపై మూత్ర విసర్జన చేస్తుండటాన్ని గమనించింది. వెంటనే కంగారుపడిన మోనల్.. అతడిని వారించే ప్రయత్నం చేసినా.. సదరు వ్యక్తి పని పూర్తి చేశాడు. దీంతో మోనల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాల్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఓ దుకాణాన్ని నిర్వహించే సదరు వ్యక్తే ఈ పని చేశాడని పోలీసులు అంటున్నారు. అతని పేరు కామలేష్ పటేల్ అని పోలీసులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments