Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్‌ బరిలో తమిళ సినిమా... సి.కళ్యాణ్ ట్విస్ట్... ఏంటది?

ఈ ఏడాది ఆస్కార్‌ బరిలో తమిళ సినిమా ఎంపికైంది. ప్రతి ఏడాది ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ఫారిన్‌ ఫిలిం కేటగిరీలో భారత్‌ నుంచి ఓ సినిమాని ఎంపిక చేసి పంపుతారు. ఈ బాధ్యత ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చేపడుతుంది. ఈ ఫెడరేషన్‌ ఈ సంవత్సరం భారత్‌ నుంచి 'విశా

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (20:15 IST)
ఈ ఏడాది ఆస్కార్‌ బరిలో తమిళ సినిమా ఎంపికైంది. ప్రతి ఏడాది ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ఫారిన్‌ ఫిలిం కేటగిరీలో భారత్‌ నుంచి ఓ సినిమాని ఎంపిక చేసి పంపుతారు. ఈ బాధ్యత ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చేపడుతుంది. ఈ ఫెడరేషన్‌ ఈ సంవత్సరం భారత్‌ నుంచి 'విశారణై' అనే తమిళ చిత్రాన్ని ఆస్కార్‌ బరికి ఎంపిక చేసింది. గురువారం సాయంత్రం హైదరాబాద్‌ ఫిలింఛాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మెన్‌ కేతం మెహతా ప్రకటించారు.
 
ఈ చిత్ర కథ ఓ ఆటో డ్రైవర్‌ తన స్వీయ అనుభవాలతో రాసిన 'లాక్‌ అప్‌' అనే నవల ఆధారంగా దర్శకుడు వెట్రి మారన్‌ తెరకెక్కించాడు. ప్రముఖ నటుడు ధనుష్‌ నిర్మించిన ఈ చిత్రంలో పోలీసుల అకత్యాలు, లంచగొండితనం, న్యాయం ఓడిపోవడం వంటి అంశాలు ప్రస్తావించబడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శలకుల మన్ననలను కూడా పొందింది. ఈ చిత్రం జాతీయ అవార్డు పొందడంతో పాటు 72వ వెనీస్‌ చిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శింపబడింది. కాగా ఈ చిత్రాన్ని తమిళ వ్యక్తి ఎవ్వరూ చూడలేదనీ, తమిళేతర వ్యక్తులంతా చూసి ఈ చిత్రాన్ని ఎంపిక చేసినట్లు మెహతా తెలిపారు. ట్విస్ట్ ఏమిటంటే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ తెలుగులో విడుదల చేయబోతున్నారు. మొత్తమ్మీద పబ్లిసిటీ అలా వచ్చేస్తుందన్నమాట.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments