Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు దినం పట్ల మనవరాళ్ళు రేవతి, అనురాధ హర్షం

డీవీ
శుక్రవారం, 13 డిశెంబరు 2024 (18:02 IST)
Revathi,Anuradha, RP
1952 డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు ఆత్మార్పణంతో అసువులు బాపారు. ఆ తర్వాత నాలుగు రోజులకు  ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా ఎ.పి. ప్రభుత్వం ఆరోజును ప్రత్యేకదినంగా జీ.వో.లో పేర్కొనడంపట్ల ఆయన మనవరాళ్ళు రేవతి, అనురాధ, జబర్ దస్త్ ఆర్.పి. హర్షం వ్యక్తం చేస్తూ నేడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
 
తెలుగు వారి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు తెలుగు జాతికి నిత్యస్మరణీయుడని, నేటి తరం ఆయన వృత్తాంతాన్ని తెలుసుకోవాలని  నటుడు  "జబర్దస్త్" ఆర్.పి.  పొట్టి శ్రీరాములు మనవరాళ్లు ప్రొఫెసర్ రేవతి, అనురాధలు ఉద్బోధించారు.  మదరాసు ప్రెసిడెన్సీ  ఏలుబడిలో ఉన్న తెలుగు వాళ్లకు ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు నిరాహారదీక్ష చేసి, ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు వర్ధంతి డిసెంబర్ 15న పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్, సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు. 
 
నటుడు  "జబర్దస్త్" ఆర్.పి. మాట్లాదుతూ, "ఇంతవరకు ఎన్నో సభలు, సమావేశాలు, ప్రెస్ మీట్లలో అనేక సబ్జెక్టులపై విమర్శలు, సద్విమర్శలు చేశాను. కానీ మొట్ట మొదటి సారి ఒక మహానుభావుడి జీవిత వృత్తాంతాన్ని పూర్తిగా తెలుసుకుని మాట్లాడుతుండటం ఎనలేని సంతృప్తినిస్తోంది. దేశం కోసం, అలాగే తెలుగు వాళ్ల కోసం ఆయన తన జీవితాన్ని ఎలా త్యాగం చేశారో తెలుసుకుంటే, ప్రతీ ఘట్టంలో ఆయన పడిన తపన, ఆవేదన అర్ధమవుతుంది. ఆయన గాంధేయ వాది. స్వాతంత్ర పోరాటంలో ఉప్పు సత్యా గ్రహ ఉద్యమంలో కానీ క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర స్ఫూర్తిదాయకం. పొట్టి శ్రీరాములు లాంటి వ్యక్తులు పదిమంది తన పక్కన ఉంటే ఒక్క రోజులో స్వాతంత్య్రాన్ని తీసుకుని రావచ్చు అని మహాత్మా గాంధీ అన్నారు అంటే శ్రీరాములు అకుంఠిత దీక్ష ఎలాంటిదో ఊహించవచ్చు. ఆయనది  మధ్యతరగతి కుటుంబం. ఏడేళ్ల ప్రాయంలోనే తండ్రిని కోల్పోయిన ఆయన కస్టపడి చదువు ముగించుకుని ఉద్యోగంలో చేరినా మనసంతా స్వాతంత్ర సమరం పైన కేంద్రీకరించి, అటువైపు మరలారు.
 
తన జీవితం మొత్తాన్ని భారతమాత సేవకు, ఆ రోజుల్లోని వివక్షను తొలగించడానికి, దళిత ప్రజల దేవాలయ ప్రవేశానికి, కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించడంతో పాటు తెలుగు వాళ్ల కు ప్రత్యక రాష్ట్రం కోసమే అంకితం చేసి, అమరజీవిగా చరిత్ర పుటలలో నిలిచిపోయారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 1952 అక్టోబర్ 19న నిరాహారదీక్షను చేపట్టి, 58 రోజులపాటు కొనసాగించి, 1952 డిసెంబర్ 15న ఆయన అసువులు బాపారు. ఆ తర్వాత నాలుగు రోజులకు  ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆయన ఉద్యమ ప్రభావ ఫలితమే దేశం మొత్తం మీద బాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆయన ఆత్మార్పణ చేసిన  డిసెంబర్ 15వ తేదీన పవిత్రమైన దినంగా భావిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైన జీవో తీసుకుని రావడం అభినందనీయం " అని అన్నారు. 
 
పొట్టి శ్రీరాములు మానవరాళ్లలో ఒకరైన ప్రొఫెసర్ రేవతి మాట్లాడుతూ, "మాకన్నా ఎక్కువగా ఆర్పీ చెప్పారు. మా నాన్న ఎన్.ఆర్.గుప్తా. మా తాత అయిన పొట్టి శ్రీరాములుకు మేనల్లుడు. మా నాన్న ఎప్పుడూ తాత పక్కనే ఉండేవారు. ముఖ్యంగా తాత నిరాహారదీక్ష చేసిన 58 రోజులు ఆయన పక్కనే ఉన్నారు.  ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు నాంది తాత అని చెప్పడంలో మాకు  చాలా గర్వంగా అనిపిస్తుంది" అని అన్నారు. 
.
పొట్టి శ్రీరాములు మరో మనవరాలు అనురాధ మాట్లాడుతూ, తాతను చివరివరకు చూసిన వ్యక్తులలో నేను కూడా ఒకరిని. అయితే అప్పట్లో నాది చాలా చిన్న వయసు. తాత గారు పరమదించినప్పుడు  ఘంటసాల  కూడా మూడు గంటల పాటు పాటలు పాడి,  నివాళులు అర్పించారు. అంత మహోన్నత వ్యక్తి అయిన పొట్టి శ్రీరాములు కుటుంబీకులము అయినందుకు  మేమూ చాలా గర్విస్తున్నాం" అని అన్నారు. 
 ఇదే కార్యక్రమంలో పొట్టి శ్రీరాములుకు సంబందించిన పలు ఘట్టాలకు సంబందించిన అరుదైన పోటోలను కూడా ప్రదర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం : హరీష్ రావు

అల్లు అర్జున్ అరెస్టు పాలకులు అభద్రతకు పరాకాష్ట : కేటీఆర్

Allu Arjun Arrest: నేరుగా బెడ్ రూమ్ వరకు వచ్చేశారు.. దుస్తులు మార్చుకోనివ్వలేదు.. (videos)

Fun moments: ఏపీ కలెక్టర్ల సదస్సులో పేలిన చలోక్తులు.. నవ్వుకున్న పవన్ కల్యాణ్ (video)

Techie : భార్యాభర్తల గొడవలు.. పెళ్లి జరిగి ఐదు నెలలే.. ఆన్‌లైన్‌లో విషం తెప్పించుకుని టెక్కీ సూసైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

High blood pressure అధిక రక్తపోటు వున్నవారు ఏం తినకూడదు?

Fruits burn Belly fat, బెల్లీ ఫ్యాట్ కరిగించే పండ్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments