Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సీటీమార్' సెట్‌లో గ్రాండ్‌గా స్టార్ హీరోయిన్‌ త‌మ‌న్నా బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (17:09 IST)
ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్`. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ఈ సినిమాలో తెలంగాణ ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్ `జ్వాలారెడ్డి`గా న‌టిస్తున్న స్టార్ హీరోయిన్‌ త‌మన్నా పుట్టిన‌రోజు డిసెంబ‌ర్ 21. ఈ సంద‌ర్భంగా `సీటీమార్` సెట్‌లో త‌మ‌న్నా ‌పుట్టినరోజు వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. యూనిట్‌ సభ్యుల నడుమ కేక్‌ కట్ చేసి బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకున్నారు త‌మ‌న్నా. 
 
ఈ కార్య‌క్ర‌మంలో ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది, న‌టి భూమిక‌, చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి, స‌మ‌ర్ప‌కులు ప‌వ‌న్‌కుమార్‌, హీరోయిన్ దిగంగ‌న సూర్య‌వంశీతో పాటు చిత్ర యూనిట్ పాల్గొని త‌మ‌న్నాకు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుండి విడుద‌ల‌చేసిన గోపీచంద్, త‌మ‌న్నాల లుక్స్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.
 
కాగా ఈ రోజు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా స్టార్ హీరోయిన్‌ త‌మ‌న్నాస్పెష‌ల్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్‌. ఈ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ప‌ల్లెటూరి అమ్మాయిగా ఒక ప్రత్యేక పాత్రలో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ముఖ్యమైన పాత్రల్లో పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా న‌టిస్తున్నారు.
 
ఈ చిత్రానికి..
సినిమాటొగ్ర‌ఫి: ఎస్‌. సౌందర్‌ రాజన్‌,
సంగీతం: మణిశర్మ‌,
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు,
ఆర్ట్‌ డైరెక్టర్‌: సత్యనారాయణ డి.వై,
సమర్పణ: పవన్‌ కుమార్‌,
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి,
కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: సంపత్‌ నంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments