ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

దేవీ
మంగళవారం, 10 జూన్ 2025 (18:19 IST)
Naga Ashwin
ఇటీవలే తెలుగు సినిమాకు తెలంగాణాలో గద్దర్ అవార్డులు ప్రదానం చేయడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈనెల 14వ తేదీన ప్రకటించిన అవార్డులను హైదరాబాద్ లోని హైటెక్స్ లో ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగ అశ్విన్ ఇలా మాట్లాడారు.
 
దర్శకుడు నాగ అశ్విన్ మాట్లాడుతూ... "కల్కి సినిమా చేయడానికి మాకు ఐదు సంవత్సరాలు పట్టింది. ఈ చిత్రం కోసం ఎంతోమంది భారతదేశ సినీ చరిత్రలోనే ఇప్పటివరకు లేని ఒక గొప్ప విజువల్ వండర్ ను రూపొందించాము. దానికిగాను ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి మాకు అవార్డులు ఇవ్వడం ఎంతో సంతోషకరంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు వచ్చినప్పటికీ తర్వాత మన తెలంగాణ గద్దర్ అవార్డు రావడం అనేది ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ గద్దర్ అవార్డును ప్రారంభించి ముందుకు తీసుకు వెళుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 
 
కేవలం ఈ సంవత్సరం కాకుండా ఎన్ని సంవత్సరాలుగా చేసిన సినిమాలన్నిటిని గుర్తించి అవార్డులు ఇవ్వడం అనేది ఎంతో గొప్ప విషయం. సినీ రంగంలో బాక్సాఫీసు రికార్డుల కంటే ఎటువంటి అవార్డులు అనేవి మమ్మల్ని మరింత ప్రోత్సహిస్తాయి. ప్రభుత్వం నుండి వచ్చే ఇటువంటి గుర్తింపులు మమ్ములను మరింత ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి. అలాగే 2018 లో వచ్చిన మహానటి చిత్రానికి కూడా ఇన్ని సంవత్సరాలకు బెస్ట్ చిత్ర అవార్డు ఇచ్చినందుకు ఎంతో గర్వంగా భావిస్తున్నాను.   కళాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్నందుకుగాను తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'నిన్ను గర్భవతిని చేయాలి... మన బిడ్డ కావాలి' : మహిళతో ఎమ్మెల్యే సంభాషణ

బంగాళాఖాతంలో అల్పపీడనం: నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో భారీ వర్షాలు

బ్లూ డ్రమ్ మర్డర్ కేసు : భర్త హత్య కేసు.. జైలులో భార్య... పండంటి బిడ్డకు జన్మ

బైకును ఢీకొన్న ట్రాక్టర్-రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

న్యాయవాదిపై కేసు: ఇద్దరి మధ్య సమ్మతంతోనే శృంగారం.. అది అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments