Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంజ‌నీర్ నుంచి హీరోగా మారిన‌ గోపీచంద్‌

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (12:15 IST)
Gopichand
గోపీచంద్ పుట్టిన‌రోజు ఈరోజే. సినీరంగంలో వార‌స‌త్వంగా వ‌చ్చిన న‌టుడు గోపీచంద్‌. ఎన్నో అభ్యుద‌య సినిమాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన టి.కృష్న వార‌సుడు. గోపీచంద్ అన్న ప్రేమ్‌చంద్‌. ద‌ర్శ‌కుడు కావాల‌నే కోరి వున్న‌వాడు. అత‌ను అకాలంగా మర‌ణించ‌డంతో ర‌ష్యాలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న గోపీచంద్ ఇండియా వ‌చ్చేశాడు. ఆ త‌ర్వాత ప‌రిస్థితులు వ‌ల్ల తండ్రి కూడా కాలం చేయ‌డంతో కొంత‌కాలం ఏం చేయాల‌నే ఆలోచ‌న‌ల‌తో గ‌డిపాడు. త‌న కుటుంబ‌స‌న్నిహితులు సి.పి.ఐ. పార్టీకి చెందిన నాగేశ్వ‌ర‌రావు, పోకూరి బాబూరావంటి వారి ప్రోత్సాహంతో న‌టుడిగా మారాడు. టి.కృష్ణ మెమోరియల్ ఫిలిమ్స్ బ్యానర్ పై గోపీచంద్ ను హీరోగా పరిచయం చేస్తూ ఎమ్.నాగేశ్వరరావు ‘తొలివలపు’ చిత్రాన్ని నిర్మించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సమయంలో దర్శకుడు తేజ తన ‘జయం’ చిత్రంలో గోపీచంద్ కు విలన్ వేషం ఇచ్చాడు. ఆ సినిమాలో గోపీచంద్ నటన అందరినీ అలరించింది.
 
విల‌న్‌గా మంచి మార్కులు ప‌డ‌డంతో ప్ర‌భాస్ సినిమా `వ‌ర్షం`లోనూ విజ‌యం సాధించాడు. కానీ లోప‌ల హీరో కావాల‌నే కోరిక బ‌లంగా వుండ‌డంతో పోకూరి బాబూరావు ఆయ‌న్ను హీరోగా ‘యజ్ఞం’ చిత్రం నిర్మించారు. ఆ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో “ఆంధ్రుడు, లక్ష్యం, శౌర్యం” వంటి చిత్రాలలో హీరోగా అలరించాడు గోపీచంద్. అత‌ని కోరిక నెర‌వేరింది. ఆ త‌ర్వాత మ‌ర‌లా ఏ సినిమా చేసినా హీరోగా ఆయ‌న‌కు అంత పేరు రాలేదు. గౌతమ్ నంద, ఆక్సిజన్, పంతం, చాణక్య సినిమాలు పెద్ద‌గా ఆడ‌లేదు. బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో తీసిన `ఆరడుగుల బుల్లెట్’ సినిమాను చిత్ర నిర్మాత అర్థంత‌రంగా ఆపేశాడు. దాంతో కెరీర్ గోపీచంద్‌కు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఆ త‌ర్వాత ప్ర‌ముఖ తెలుగుహీరోకు స్నేహితుడు కావ‌డంతో ఆయ‌న‌కు హీరోగా అవ‌కాశాలు వ‌చ్చాయి. 
 
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘సీటీమార్’పైనే ఆయన ఆశలన్నీ ఉన్నాయి. ఈ సినిమా ఏప్రిల్ లో జనం ముందుకు రావలసి ఉంది. అయితే కరోనా కల్లోలం కారణంగా వాయిదా పడింది. మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ అనే చిత్రంలో గోపీచంద్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయింది. జూలై మొదటి వారంలో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. ఇప్పుడు విడుదలైన పోస్టర్లలో కూడా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.. SKN సహ నిర్మాత‌. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియ జేయనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments