Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో సినిమా ఆరంభం

డీవీ
బుధవారం, 27 మార్చి 2024 (16:44 IST)
Gopichand and Srinu Vaitla
హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా గోపీచంద్ కు 32వ సినిమా ప్రకటన వచ్చింది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి తొలి ప్రొడక్షన్ వెంచర్ ఇది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై అత్యున్నత స్థాయి ప్రొడక్షన్ , సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా కోసం చిత్రాలయం స్టూడియోస్‌తో కలిసి పని చేస్తుంది. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా చేరారు.
 
ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ నేడు ప్రారంభం ఆయింది. ఈ షెడ్యూల్‌లో, ప్రధాన తారాగణంతో  కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీంతో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది.
 
నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ - ''పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద బ్యానర్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. విశ్వప్రసాద్ గారికి ధన్యవాదాలు. సినిమా చాలా అద్భుతంగా వస్తోంది. 27 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. శ్రీను వైట్ల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఈ సినిమాకి ఒక యూనిక్ పాయింట్ వుంది. ఈ సినిమాతో శ్రీను వైట్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. గోపీచంద్, శ్రీనువైట్ల కాంబోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది'' అన్నారు
 
ఈ సినిమాలో గోపీచంద్‌ని కొత్త అవతార్ లో శ్రీను వైట్ల ప్రెజెంట్ చేస్తున్నారు. శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. కెవి గుహన్ డీవోపీగా చేస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.  ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments