Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూ/ఎ సర్టిఫికేట్ పొందిన మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (18:05 IST)
Godfather- chiru
మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ 'గాడ్ ఫాదర్' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటిస్తున్న 'గాడ్ ఫాదర్' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్న ఈ చిత్రం తాజా గాసెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్  'గాడ్ ఫాదర్' చిత్రానికి యూ/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా అద్భుతంగా వుందని సెన్సార్ బోర్డ్ సభ్యులు చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు.
 
'గాడ్ ఫాదర్' పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ థార్ మార్ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. థార్ మార్ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేయడంతో పాటు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 
ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని ముఖ్య తారాగణం. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ , సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్.
గాడ్ ఫాదర్ ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments