అనంతపురంలోని జేఎన్‌టీయూ గ్రౌండ్‌లో గాడ్‌ ఫాదర్ మెగా పబ్లిక్‌ ఈవెంట్‌

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2022 (18:58 IST)
gangstar-chiru
భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు  మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటిస్తున్న ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గాడ్ ఫాదర్' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ.  స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ అక్టోబర్ 5 న గ్రాండ్ విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది.మేకర్స్  ఇప్పుడు గాడ్ ఫాదర్ మెగా పబ్లిక్ ఈవెంట్ తేదీ, వేదికను ప్రకటించారు.
 
సెప్టెంబరు 28న అనంతపురంలోని జేఎన్‌టీయూ మైదానంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు గాడ్ ఫాదర్ టీమ్‌ ఈ మెగా వేడుకకు హాజరుకానున్నారు. పెద్ద సంఖ్యలో వస్తున్న అభిమానులు, సినీ ప్రేక్షకుల సమక్షంలో ఈ వేడుక గ్రాండ్ గా జరగనుంది.
 
ఈ సినిమాలో చిరంజీవి తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్నారు. సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని ముఖ్య తారాగణం.  కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.
 
మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్. గాడ్ ఫాదర్  అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహం అంటే అత్యాచారం చేయడానికి లైసెన్స్ కాదు : ఢిల్లీ కోర్టు

YS Jagan: 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. వైకాపా చీఫ్ జగన్ సీటు ఏమౌతుంది?

Naga Babu vs Balakrishna: నాగబాబు - బాలయ్యతో ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త- రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు

ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతా.. కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments