Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది అంటోన్న అంజలి

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2023 (18:14 IST)
Gitanjali malli vachindi
టాలీవుడ్ హిస్ట‌రీలో అంజ‌లి న‌టించిన `గీతాంజ‌లి` సినిమాను అంత తేలిగ్గా ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకున్న `గీతాంజ‌లి` సినిమాకు సీక్వెల్ సిద్ధ‌మైంది. ప్రతీకార జ్వాల‌తో మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది గీతాంజ‌లి అంటూ `గీతాంజ‌లి` సీక్వెల్ గురించి అనౌన్స్ చేశారు మేక‌ర్స్.
 
గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది` అనే పేరుతో సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. వెన్నులో వ‌ణుకు తెప్పించే స్పైన్‌ చిల్లింగ్ ప్రాజెక్ట్ అంటూ థ్రిల్లింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు మేక‌ర్స్. `గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది` సినిమా షూటింగ్ ఇవాళ్టి నుంచి మొద‌లైంది. కోన వెంక‌ట్ స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తున్న సినిమా `గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది`. ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలు ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నాయి. 
 
Anjali, Srinivasa Reddy, Shakalaka Shankar
అచ్చ తెలుగు అమ్మాయి అయినా ప్యాన్ ఇండియా రేంజ్‌లో మెప్పిస్తున్న అంజ‌లి న‌టిస్తున్న 50వ సినిమా ఇది. ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ నిర్మిస్తున్నారు.
 
ఓ పాడుబ‌డ్డ బంగ్లా ప్రాంగ‌ణంలో అటుగా తిరిగి కూర్చుని ఉన్న అమ్మాయితో పోస్ట‌ర్ సినిమాపై ఆస‌క్తి క‌లిగిస్తూ, ఆక‌ట్టుకుంటోంది. 
`గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది` సినిమా ముహూర్త‌పు స‌న్నివేశానికి రామ‌చంద్ర క్లాప్‌కొట్టారు. సినిమా స్క్రిప్ట్‌ని ఎంవీవీ స‌త్యనారాయ‌ణ‌, కోన వెంక‌ట్ సంయుక్తంగా డైర‌క్ట‌ర్ శివ తుర్ల‌పాటికి అంద‌జేశారు.
 
`గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది` చిత్రంలో అంజ‌లి, శ్రీనివాస‌రెడ్డి, స‌త్యం రాజేష్‌, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, అలీ, బ్ర‌హ్మాజీ, ర‌వి శంక‌ర్ (డ‌బ్బింగ్ ఆర్టిస్ట్), రాహుల్ మాధ‌వ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 
 
ఈ సినిమాకు క‌థ‌:  కోన వెంక‌ట్‌, స్క్రీన్ ప్లే:  కోన వెంక‌ట్‌, భాను భోగ‌వ‌ర‌పు, మాట‌లు:  భాను భోగ‌వ‌ర‌పు, నందు శ‌వ‌రిగ‌ణ‌, ద‌ర్శ‌క‌త్వం:  శివ తుర్ల‌పాటి, సంగీతం:  ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, కెమెరా:  సుజాత సిద్ధార్థ్, ఎడిట‌ర్‌:  చోటా కె ప్ర‌సాద్‌, ఆర్ట్:  నార్ని శ్రీనివాస్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌:  నాగు వై, పీ ఆర్ ఓ:  వంశీ కాక‌, ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌:  అనిల్ భాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments