Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ అనుమానంతో బుల్లితెరకు దూరమవుతున్న గెటప్ శ్రీను?

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (17:54 IST)
జబర్దస్త్ ఏ స్థాయిలో తెలుగు ప్రేక్షకులను మెప్పించిందో పెద్దగా చెప్పనవసరం లేదు. అందులో నటించిన వారిని ఏకంగా హీరోలనే చేసేసింది. వెండితెరపై ఆఫర్లు వచ్చేలా చేసింది. ఇప్పటికే సుడిగాలి సుధీర్‌తో పాటు చాలామందే హీరోలుగా ట్రై చేశారు కూడా. మిగిలిన వారు సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. కొన్ని చిన్న క్యారెక్టర్లను చేస్తూ ఉన్నారు.
 
అయితే గత కొన్నిరోజులుగా గెటప్ శ్రీను షోలో కనిపించడం లేదు. దీంతో అభిమానులు గెటప్ శ్రీనుకు ఏదో అయ్యింది.. జబర్దస్త్‌కు ఇక రాడేమోనన్న ఆందోళనలో ఉన్నారు. అంతేకాదు గెటప్ శ్రీను తనతో పాటు  మరికొంతమందిని వెంటపెట్టుకుని వెళుతున్నారని ప్రచారం బాగానే సాగుతోంది.
 
ఈ నేపథ్యంలో గెటప్ శ్రీను స్పందించారు. తాను జబర్దస్త్‌‌ను వదిలి వెళ్ళడం లేదని..తనకు గుర్తింపు తెచ్చిన జబర్దస్త్‌‌ను నమ్ముకునే తాను ముందుకు వెళుతున్నానంటున్నాడు గెటప్ శ్రీను. ఈ మధ్య సెట్లో కొంతమంది కరోనా పాజిటివ్ వచ్చిందని.. తను చెక్ చేసుకుంటే నెగిటివ్ వచ్చిందని చెప్పారు.
 
అయితే వైద్యులు మాత్రం ఇంట్లోనే ఉండమని చెప్పారని.. హోం ఐసోలేషన్లో ఉంటే మంచిదని సలహా ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో తాను జబర్దస్త్‌ షోలో నటించడానికి వెళ్ళలేదంటున్నాడు గెటప్ శ్రీను. అనవసరంగా తనపై చేస్తున్న దుష్ర్పచారాన్ని మానుకోవాలంటున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments