Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.600కోట్లతో మహాభారతం.. భీముడిగా మోహన్‌లాల్: నాగ్ కీలక పాత్ర-ద్రౌపదిగా ఐష్-అర్జునుడిగా విక్రమ్..

మహాభారతంలోని కొన్ని ఎపిసోడ్స్‌ సినిమా రూపుదిద్దుకోనున్నాయి. ఈ సినిమా కోసం రూ.600 కోట్లు వెచ్చించనున్నారు. ఈ మహా ప్రాజెక్టు కోసం అక్కినేని నాగార్జున, మలయాళ నటుడు మోహన్‌లాల్ చేతులు కలపనున్నారు. ‘రంధమూలం

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (15:53 IST)
మహాభారతంలోని కొన్ని ఎపిసోడ్స్‌ సినిమా రూపుదిద్దుకోనున్నాయి. ఈ సినిమా కోసం రూ.600 కోట్లు వెచ్చించనున్నారు. ఈ మహా ప్రాజెక్టు కోసం అక్కినేని నాగార్జున, మలయాళ నటుడు మోహన్‌లాల్ చేతులు కలపనున్నారు. ‘రంధమూలం’ మహాభారత గాథలోని కొన్ని పర్వాలను ఆధారంగా చేసుకుని మలయాళ రచయిత ఎంటీ వాసుదేవన్ రచించిన నవల నుంచి ఈ సినిమాను రూపొందించనున్నారు. 
 
కురుపాండవులే ఈ రచనలో ప్రధాన పాత్రధారులు. దీన్ని సినిమా తీసుకొచ్చే దిశగా మోహన్ లాల్ ప్రయత్నాలు చేశారు. మూడేళ్ల కిందటే ఈ ప్రతిపాదన వచ్చినా ఎందుకో పట్టాలెక్కలేదు. తాజాగా లాల్ మాట్లాడుతూ ‘రంధమూలం’ ను సినిమాగా తీసుకొస్తానని వ్యాఖ్యానించాడు. దానికి ఏకంగా ఆరువందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టుగా ప్రకటించారు, 
 
ఇక భారత దేశ సినీ చరిత్రలోనే ఏకంగా ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన సినిమాలేవీ ఇంత వరకూ లేవు. ఇదే జరిగితే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిలుస్తుంది. ఈ నవల భీమసేనుని ప్రధాన పాత్రగా సాగుతుందట. 
 
భీమసేనుడిగా ఈ చిత్రంలో మోహన్ లాల్ నటిస్తారని తెలుస్తోంది. ఇక భీష్ముడి పాత్రకు అమితాబ్‌ను, అర్జునుడి పాత్రకు విక్రమ్‌ను, ద్రౌపది పాత్రకు ఐశ్వర్యరాయ్‌ను తీసుకుంటారని సమాచారం. ఈ సినిమాలో నాగార్జున ఒక ముఖ్యపాత్రను చేయబోతున్నాడట. మలయాళ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తారని తెలిసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments