Webdunia - Bharat's app for daily news and videos

Install App

''గీత గోవిందం'' ఓవర్.. నాగశౌర్యతో రొమాంటిక్ సినిమా.. హీరోయిన్?

''గీత గోవిందం'' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. యూత్ మధ్య క్రేజున్న హీరోను పట్టుకొచ్చి.. తమ బ్యానర్‌ సత్తాను మరోసారి నిరూపించుకుంది గీతా ఆర్ట్స్. అర్జున్ రెడ్డి మాంచి పేరు తెచ్చుకున్న విజయ్ దే

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (18:00 IST)
''గీత గోవిందం'' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. యూత్ మధ్య క్రేజున్న హీరోను పట్టుకొచ్చి.. తమ బ్యానర్‌ సత్తాను మరోసారి నిరూపించుకుంది గీతా ఆర్ట్స్. అర్జున్ రెడ్డి మాంచి పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండతో గీత గోవిందం సినిమాను నిర్మించిన గీతా ఆర్ట్స్ మరో రొమాంటిక్ సినిమాను తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా మరో క్రేజ్ హీరో నాగశౌర్యను కథానాయకుడిగా ఎంచుకుంది. 
 
ఇటీవల గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన గీత గోవిందం.. కొత్త కోణంలో ఆవిష్కరించబడిన ప్రేమకథా చిత్రంగా సరికొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఇదే తరహాలో సూపర్ రొమాంటిక్ సినిమాను తెరకెక్కించేందుకు గీతా ఆర్ట్స్ సిద్ధమైంది. ఇందులో కథానాయకుడిగా నాగశౌర్యను ఎంపిక చేసుకున్నారు. 
 
కథానాయిక ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. తక్కువ బడ్జెట్ లోనే చేసే ఈ సినిమాను ఓ యువదర్శకుడికి అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు చివరి దశకి చేరుకున్నాయనీ, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, స్టార్ హీరోలు అల్లు అర్జున్- మహేష్ బాబు కాంబోలో గీతా ఆర్ట్స్ సంస్థ ఓ కొత్త సినిమాను తెరకెక్కించే దిశగా రంగం సిద్ధం చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments