Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మూడు చిత్రాల ఆడియో ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా రిలీజ్...

దక్షిణ భారత దేశంలో ఎన్నో ఏళ్ళ నుంచి ఆడియో రంగంలో ఉండి, ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల ఆడియోల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించిన‌ ప్రతిష్టాత్మక ఆడియో సంస్థ లహరి మ్యూజిక్. తెలుగు చ‌ల‌నచిత్ర చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (16:56 IST)
దక్షిణ భారత దేశంలో ఎన్నో ఏళ్ళ నుంచి ఆడియో రంగంలో ఉండి, ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల ఆడియోల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించిన‌ ప్రతిష్టాత్మక ఆడియో సంస్థ లహరి మ్యూజిక్. తెలుగు చ‌ల‌నచిత్ర చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచేలా మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150, నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాత‌క‌ర్ణి, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి 2 చిత్రాలు రూపొందుతున్నాయి. ఈ మూడు చిత్రాలు వ‌చ్చే సంవ‌త్స‌రం ప్ర‌థమార్ధంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాయి. 
 
అయితే.. ఈ మూడు చిత్రాల ఆడియోల‌ పై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోనూ భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. దీంతో ఆడియో రైట్స్ విష‌యంలో భారీ పోటీ ఏర్ప‌డింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌ముఖ ఆడియో సంస్థ ల‌హ‌రి మ్యూజిక్ ఈ మూడు భారీ చిత్రాల ఆడియో రైట్స్ ద‌క్కించుకోవ‌డం విశేషం. 
 
ఈ సందర్భంగా లహరి మ్యూజిక్ అధినేత జి.మనోహర్ నాయుడు మాట్లాడుతూ.... చిరంజీవి సినిమాలు మాస్ట‌ర్, హిట్ల‌ర్, మెకానిక్ అల్లుడు, ముఠామేస్త్రి, ఆప‌ధ్భాంధ‌వుడు, ఘ‌రానా మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడ‌ర్, ముగ్గురు మొన‌గాళ్లు చిత్రాల ఆడియోల‌ను మా సంస్థ ద్వారానే రిలీజ్ చేసాం. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలోనూ చిరంజీవి కెరీర్‌లోను ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150 చిత్రం ఆడియో రైట్స్‌ను కూడా మా ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తుండ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ సంద‌ర్భంగా చిరంజీవికి, వినాయ‌క్‌కు, రాంచ‌ర‌ణ్‌కు, దేవిశ్రీప్ర‌సాద్‌కు ధన్యవాదాలు చెపుతున్నట్టు తెలిపారు.
 
ఇక మా సంస్థ ద‌క్కించుకున్న మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రం నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. బాల‌కృష్ణ న‌టించిన లెజెండ్, ల‌య‌న్, లారీ డ్రైవ‌ర్, నారి నారి నడుమ మురారి, రౌడీ ఇన్ స్పిక్టెర్, అశ్వ‌మేధం, నిప్పుర‌వ్వ‌, బంగారు బుల్లోడు, మిత్రుడు చిత్రాల ఆడియోల‌ను మా సంస్థ ద్వారానే రిలీజ్ చేసాం. ఇపుడు కూడా బాల‌కృష్ణ గారి కెరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క చిత్ర‌మైన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం ఆడియోను కూడా మా సంస్థ ద్వారానే రిలీజ్ చేస్తుండ‌డం చాలా సంతోషంగా ఉంది.
 
ఇకపోతే.. ఖైదీ నెం 150, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఈ రెండు చిత్రాల త‌ర్వాత ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా రిలీజ్ కానున్న‌ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం బాహుబ‌లి -2. తెలుగు సినిమా స‌త్తాని ప్ర‌పంచానికి చాటి చెప్పిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ఈ చిత్రం ఆడియో రైట్స్‌ను కూడా ఈ సంస్థే ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. ప్ర‌భాస్ న‌టించిన డార్లింగ్, బిల్లా చిత్రాల ఆడియోల‌ను ల‌హ‌రి మ్యూజిక్ ద్వారానే రిలీజ్ చేశా. ఇప్పుడు బాహుబ‌లి, బాహుబ‌లి 2 ఆడియోల‌ను కూడా మా సంస్థ ద్వారానే రిలీజ్ చేస్తుండ‌డం చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

కాకినాడ రేషన్ బియ్యం మాఫియా.. పవన్ జోక్యం.. షిప్ సీజ్‌పై కసరత్తు

రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142కోట్ల నిధులు.. కేంద్రం ఆమోదం..

ఫెంగల్ తుఫాను-తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

కాకినాడ ఓడరేవు భద్రతపై పవన్ ఆందోళన.. పురంధేశ్వరి మద్దతు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments