Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబ‌ర్ 26న తిరుప‌తిలో గ్రాండ్‌ లెవ‌ల్లో `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` ఆడియో విడుద‌ల

క‌లియుగ దైవం శ్రీ తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రుడి పాదాల చెంత‌నున్న తిరుప‌తిలో న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఆడియో ఆవిష్క‌ర‌ణ కానుంది. ఈ వేడుక తిరుప‌తిలోని శ్రీ పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రు మున్సిప‌ల్ హై స్కూల్‌లో డిసెంబ‌ర్ 26న గ్

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (20:03 IST)
క‌లియుగ దైవం శ్రీ తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రుడి పాదాల చెంత‌నున్న తిరుప‌తిలో న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఆడియో ఆవిష్క‌ర‌ణ కానుంది. ఈ వేడుక తిరుప‌తిలోని శ్రీ పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రు మున్సిప‌ల్ హై స్కూల్‌లో డిసెంబ‌ర్ 26న గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`.
  
రీసెంట్‌గా విడుద‌లైన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌రే తెలుగు సినిమా ట్రైల‌ర్స్‌కు లేని విధంగా యూ ట్యూబ్ చానెల్‌లో హ‌య్య‌స్ట్ వ్యూస్‌తో గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఓ సెన్సేష‌న‌ల్ రికార్డును క్రియేట్ చేసింది. ఈ స్పంద‌న‌తో చిత్ర‌యూనిట్ ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఈ వేడుక‌కు కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌వుతున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా... వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ - `క‌రీంన‌గ‌ర్ జిల్లా కోటిలింగాల స‌హా రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 థియేట‌ర్స్‌లో విడుద‌లైన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ స్పంద‌న‌తో సినిమా కోసం అంద‌రూ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్థ‌మ‌వుతుంది. ఈ సినిమా ఆడియో వేడుక‌ను డిసెంబ‌ర్ 26న తిరుప‌తిలోని శ్రీ పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రు మున్సిప‌ల్ హై స్కూల్ గ్రౌండ్‌లో గ్రాండ్‌గా నిర్వ‌హిస్తున్నాం. ఈ వేడుక‌కు కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌ నాయుడుగారు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడుగారు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌వుతున్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ‌, హేమామాలిని, డైరెక్ట‌ర్ క్రిష్‌, శ్రియా శ‌ర‌న్ స‌హా టోట‌ల్ టీం ఈ వేడుక‌లో పాల్గొంటారు అన్నారు' అన్నారు.
 
నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రేయ, క‌బీర్ బేడి త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి  సమర్పణ : బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్ : జ్ఞాన శేఖర్, ఆర్ట్ : భూపేష్ భూపతి,  సంగీతం : చిరంత‌న్ భ‌ట్‌, సాహిత్యం : సీతారామశాస్త్రి, మాటలు : సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత : కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు : వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం : క్రిష్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రముఖ గాయకుడు పి.జయచంద్రన్ కన్నుమూత

వరకట్నం కోసం 21 ఏళ్ల మహిళ గొంతు కోసి చంపేశారు..

కోడలిని హత్య చేసి పాతిపెట్టిన అత్తమామలు.. చివరికి ఏమైందంటే?

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎస్పీపై బదిలీవేటు

అవేవీ అవసరం లేకపోయినా కొంటూ, ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా కుంగిపోతున్న ప్రజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments