Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుస్ సరసన గౌతమి కుమార్తె సుబ్బులక్ష్మి.. వేలై ఇల్లా పట్టదారి-2లో హీరోయిన్

సినీ లెజెండ్ కమల్ హాసన్ నుంచి దూరమయ్యాక నటి గౌతమి తన కుమార్తె కెరీర్‌పై దృష్టి పెట్టారు. టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన గౌతమి.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'గురు శిష్యన్‌'తో పరిచయమైంది. త

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (09:19 IST)
సినీ లెజెండ్ కమల్ హాసన్ నుంచి దూరమయ్యాక నటి గౌతమి తన కుమార్తె కెరీర్‌పై దృష్టి పెట్టారు. టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన గౌతమి..  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'గురు శిష్యన్‌'తో పరిచయమైంది. తర్వాత కమల్‌, విజయకాంత్‌ వంటి అప్పటి అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది. ముఖ్యంగా హీరో రామరాజన్‌ చిత్రాలలో ఎక్కువగా నటించింది. అలా కమల్ హాసన్‌తో 13 ఏళ్ల పాటు సహజీవనం చేసింది. కానీ తన కుమార్తె కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయనకు బ్రేకప్ ఇచ్చింది. 
 
ప్రస్తుతం తన కుమార్తె సుబ్బులక్ష్మిని హీరోయిన్‌గా పరిచయం చేయాలని గౌతమి రంగం సిద్ధం చేసుకుంటోంది. దీనికోసం ధనుష్‌, శివకార్తికేయన్‌ తదితర హీరోలను అవకాశం ఇవ్వాలని కోరిందట. దీనికి ధనుష్‌ సానుకూలంగా స్పందించారట. ఆయన నటిస్తున్న 'వేలై ఇల్లా పట్టదారి -2'లో సుబ్బులక్ష్మిని ఎంపిక చేసినట్లు సమాచారం. మరికొందరు కథానాయకులతోనే టచ్‌లో గౌతమి ఉన్నట్లు తెలిసింది. గౌతమి తన కుమార్తె సినీ కెరీర్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టిందని.. మరి సుబ్బులక్ష్మి వెండితెరపై ఏమేరకు రాణిస్తుందో వేచి చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?

Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments