Webdunia - Bharat's app for daily news and videos

Install App

Game changer DHOP, చెర్రీ-కియారా ధోప్ సాంగ్ సోషల్ మీడియాలో షేక్ (Video)

ఐవీఆర్
గురువారం, 26 డిశెంబరు 2024 (19:35 IST)
రామ్ చరణ్ (Ram Charan), కియరా (Kiara Adwani) జంటగా నటించిన గేమ్ ఛేంజర్ (Game changer) చిత్రంలో క్రేజీగా సాగే డోప్ (DHOP) సాంగ్‌ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. డైరెక్ట‌ర్ శంక‌ర్ త‌న‌దైన శైలిలో మ‌రోసారి మేకింగ్‌లో త‌నేంటో ఈ సాంగ్‌తో ప్రూవ్ చేశారు. త‌మ‌న్ కంపోజిష‌న్ దీనికి పెద్ద ఎసెట్‌గా మారింది. రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాసిన ఈ పాట‌ను తమిళంలో వివేక్, హిందీలో రక్వీబ్ ఆలం రాశారు. అలాగే తెలుగులో ఈ పాటను తమన్ ఎస్, రోషిణి, పృథ్వీ శ్రుతి రంజని ఆలపించగా.. తమిళంలో తమన్ ఎస్, అదితీ శంకర్, పృథ్వీ.. హిందీలో తమన్ ఎస్, రాజకుమారి, పృథ్వీ శ్రుతి రంజని ఆలపించారు. పాట‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌స్తోంది. పాట‌లో అక్క‌డ‌క్క‌డ రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ వేసిన డాన్స్ ఎంతో క్యూట్‌గా ఉంది.
 
< — Gani (GaniCharan1) December 26, 2024 >ఇప్పటికే గేమ్ చేంజ‌ర్ మూవీ నుంచి రిలీజైన .. జరగండి, రా మచ్చా మచ్చా, నా నా హైరానా అనే పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటి స‌ర‌స‌న డోప్ సాంగ్ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది. రామ్ చ‌ర‌ణ్.. గేమ్ చేంజర్ చిత్రంలో రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్‌.యు.వెంక‌టేశ‌న్‌, వివేక్ రైట‌ర్స్‌గా వ‌ర్క్ చేశారు. హ‌ర్షిత్ స‌హ నిర్మాత‌. ఎస్‌.తిరుణ్ణావుక్క‌ర‌సు సినిమాటోగ్ర‌ఫీ, ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా సాయి మాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియాంకా గాంధీ భర్తకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధించాలి : ఈడీ

ఎయిర్‌పోర్టులకు ధీటుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి : డాక్టర్ పెమ్మసాని

భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకిన భార్య

బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా? పులివెందులలో టీడీపీ వినూత్న ప్రచారం

మేమే బాస్‌ అనుకునేవారికి భారత్ వృద్ధి నచ్చలేదు : రాజ్‌నాథ్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments