Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెన్సార్‌కు సిద్ధ‌మైన ‘గ‌ల్లీరౌడీ’

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (15:45 IST)
Sandeep, Nehashetti
సందీప్ కిష‌న్ టైటిల్ పాత్ర‌లో నటిస్తోన్న చిత్రం ‘గ‌ల్లీరౌడీ’. కోన వెంక‌ట్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి. సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఇందులో ప్ర‌ధాన‌పాత్ర‌ పోషించారు. బాబీ సింహ ఓ కీలక పాత్రలో నటించారు. నేహా శెట్టి హీరోయిన్‌. ఈ ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసుకుని సెన్సార్‌కు సిద్ధ‌మైంది. 
 
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలుపుతూ, ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ సినిమా ఎంత హిలేరియ‌స్‌గా ఉంటుంద‌నే విష‌యాన్ని రాబ‌ట్టుకుంది. హీరో, హీరోయిన్ మ‌ధ్య సాగే ల‌వ్ మాంటేజ్ సాంగ్ ‘పుట్టనే ప్రేమ...’కు మంచి స్పందన వచ్చింది. సినిమా ఫన్ రైడర్‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డం ఖాయ‌మ‌ని అంద‌రిలో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. అలాగే రాజేంద్ర ప్ర‌సాద్‌గారు సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఆయ‌న పాత్రకున్న ప్రాధాన్య‌త ఏంటో సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంది. బాబీసింహా  కూడా కీల‌క పాత్ర‌ను పోషించారు. ది ఫ్యామిలీ మేన్ 2, ఛ‌లో వంటి చిత్రాల్లో న‌టించిన మెప్పించిన మైమ్ గోపి ఈ చిత్రంలో విల‌న్‌గా న‌టించారు. అలాగే హీరోయిన్ నేహాశెట్టి రోల్‌, ఇలా అంద‌రి పాత్ర‌లను ప్ర‌తి ఒక్క‌రూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సినిమా పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్యక్ర‌మాలు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లోనే సెన్సార్ కూడా పూర్తి చేసుకోనుంది. సెన్సార్ పూర్తి కాగానే సినిమా రిలీజ్ డేట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తాం’’ అని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలిపారు.
నిర్మాత‌:  ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌
సంగీతం:  చౌర‌స్తా రామ్‌, సాయికార్తీక్‌
క‌థ‌:  భాను
ఎడిట‌ర్‌:  ఛోటా కె.ప్ర‌సాద్‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజీ కుదిరితే కేసు కొట్టేస్తారా.. టీచర్‌ను ప్రాసిక్యూట్ చేయండి.. సుప్రీంకోర్టు

సొంత చెల్లిని తిడితే జగన్‌కు పౌరుషం రాలేదా? హోంమంత్రి అనిత

దేశంలో అత్యధిక విరాళాలు ఇచ్చిన శివ్ నాడార్..

2025 జనవరి 20న మధ్యాహ్నం డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం

మాట్లాడేందుకు మైక్ ఇస్తామంటేనే అసెంబ్లీకి వెళతాం : వైఎస్ జగన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

తర్వాతి కథనం
Show comments