Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగిల్ మ‌ద‌ర్ పిల్ల‌ల‌కు ఉచితంగా ఓపీడీ చికిత్స : ఉపాస‌న కామినేని కొణిదెల

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (16:16 IST)
Upasana Kamineni
వైద్య రంగంలో అరుదైన సేవ‌ల‌ను అందిస్తూ దేశం యావ‌త్తు త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న అపోలో హాస్పిట‌ల్స్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. తాజాగా అపోలో హాస్పిట‌ల్స్ చిన్న పిల్ల‌ల కోసం ప్ర‌త్యేక‌మైన విభాగాన్ని ప్రారంభించింది. అదే అపోలో హాస్పిట‌ల్స్ చిల్డ్ర‌న్ హాస‌. ఈ అపోలో   చిల్డ్ర‌న్స్ హాస్పిట‌ల్స్ లోగోను అపోలో ఫౌండేష‌న్ వైస్ చైర్‌ప‌ర్స‌న్ ఉపాస‌న కామినేని కొణిదెల ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మంలో అపోలో డాక్ట‌ర్స్ పాల్గొన్నారు. 
 
ఈ సంద‌ర్భంగా ఉపాస‌న కామినేని కొణిదెల మాట్లాడుతూ ‘‘నేను ప్రెగ్నెంట్‌గా ఉన్న స‌మ‌యంలో అంద‌రూ నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించ‌టంతో పాటు ఆశీర్వాదాల‌ను అందించారు. నా ప్రెగ్నెన్సీ జ‌ర్నీని అద్భుత‌మైన జ్ఞాప‌కంగా చేసిన అంద‌రికీ ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌ల‌ను తెలియ‌చేస్తున్నాను. అపోలో పీడియాట్రిక్‌, అపోలో చిల్డ్ర‌న్స్ హాస్పిట‌ల్స్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌టం ఎంతో ఆనందంగా ఉంది. ప్ర‌తీ త‌ల్లికి ప్రెగ్నెన్సీ అనేది ఓ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ. బిడ్డ‌కు ఏదైనా అనారోగ్యం క‌లిగిన‌ప్పుడు త‌ల్లిదండ్రులు ఎంతో బాధ‌ప‌డ‌తారు. అదే బిడ్డ తిరిగి ఆరోగ్యంతో కోలుకుంటే వారి ఆనందానికి అంతే ఉండ‌దు. అలాంటి మ‌ధుర క్ష‌ణాల‌ను త‌ల్లిదండ్రుల‌కు అందిస్తోన్న డాక్ట‌ర్స్‌కు ధ‌న్య‌వాదాలు. 
 
నా ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో చాలా మంది న‌న్ను క‌లిసి వారి స‌ల‌హాల‌ను ఇచ్చేవారు. అయితే కొందరి మ‌హిళ‌లకు ఇలాంటి స‌పోర్ట్ దొర‌క‌దు. ఆ విష‌యం నాకు తెలిసి బాధ‌వేసింది. మ‌రీ ముఖ్యంగా సింగిల్ మ‌ద‌ర్స్‌కు ఇలాంటి విష‌యాల్లో స‌పోర్ట్ పెద్ద‌గా ఉండ‌దు. కాబ‌ట్టి అపోలో వైస్ చైర్‌ప‌ర్స‌న్‌గా నేను ఓ ప్ర‌క‌ట‌న చేయాల‌ని అనుకుంటున్నాను. వీకెండ్స్‌లో సింగిల్ మ‌ద‌ర్  పిల్ల‌ల‌కు ఉచితంగా ఓపీడీ చికిత్స‌ను అందించ‌బోతున్నాం. ఇలాంటి ఓ ఎమోష‌న‌ల్ జ‌ర్నీలో నేను వారికి నా వంతు స‌పోర్ట్ అందిచ‌టానికి సిద్ధం. ఈ ప్ర‌క‌ట‌న చేయ‌టానికి గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది నా చాలా మందికి హెల్ప్ అవుతుంద‌ని భావిస్తున్నాను’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments