Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు దశాబ్దాల సాగర సంగమం

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (16:32 IST)
Jayaprada, kamal
కే.విశ్వనాధ్ , ఏడిద నాగేశ్వరరావు , కమలహాసన్, ఇళయరాజా ల కలయిక లో పూర్ణోదయా పతాకం పై నిర్మిచించిన ప్రతిష్టాత్మక , కళాత్మక చిత్రం ‘“ సాగర సంగమం ‘ . ఈ చిత్రం జూన్ 3 , 1983 న తెలుగులో  “సాగర సంగమం” , తమిళంలో  “ సలంగై ఒలి “ , మలయాళంలో  “ సాగర సంగమం “ గా ఒకే రోజు విడుదలయ్యాయి . అంటే, నేటికి 40 సంవత్సరాలు పూర్తి అయ్యాయి . అన్ని భాషల్లో  ఆఖండ  విజయం సాధించింది . నేటి మేటి దర్శకులెందరికో  స్ఫూర్తి  ఈ చిత్రం. ఈ విషయం వాళ్ళు స్యయంగా ఎన్నో సార్లు వ్యక్తపరిచారు 
 
శంకరాభరణం అంతటి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చిత్రం తరువాత అదే కాంబినేషన్ అయిన కే.విశ్వనాథ్ - ఏడిద నాగేశ్వరరావు కలయికలో  వచ్చిన మరో సంచలన కళా ఖండం ,” సాగర సంగమం “. భారత చలనచిత్ర 100 సంవత్సరాలు సందర్భంగా CNN-IBNs List of the 100 Greatest Indian Films of All Time లో ఈ చిత్రం 13 వ స్థానం దక్కించుకుంది . 
 
అలాగే రష్యన్ భాషలోకి అనువదించి అక్కడి 400 థియేటర్లలో ఒకే సారి విడుదలయ్యి వారి అభిమానాన్ని కూడా పొందిన మొట్ట మొదటి తెలుగు చిత్రం . ఈ చిత్రం శతదినోత్సవం తో పాటు ఎన్నో కేంద్రాలలో సిల్వర్ జూబిలీ , గోల్డెన్ జూబిలీ కూడా జరుపుకుంది. బెంగుళూరు లో 511 రోజులు ఒకే థియేటర్ లో ప్రదర్శింపబడ్డ చిత్రం సాగర సంగమం . ఈ చిత్రం విడుదలయ్యాక చాలా మంది శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడానికి డాన్స్ క్లాసులకి వెళ్లేవారు . ఇప్పటికీ లోక నాయకుడు కమలహాసన్ తనకు బాగా నచ్చిన చిత్రాల్లో సాగర సంగమం పేరే ముందుంటది. అలాగే కళా తపస్వి శ్రీ కే.విశ్వనాధ్ దర్శక ప్రతిభ ప్రతీ సన్నివేశంలో మనకు కనబడుతుంది . ఇక ఇళయరాజా సంగీతం ... ఈ చిత్రానికి ఓ హై లైట్ .
 
 ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి . అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వైవిధ్యంగా కుదిరింది . అప్పటికే ఎన్నో తమిళ సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించి ఓ ట్రెండ్ సెట్ చేసిన ఇళయరాజాకు మొట్ట మొదటి సారి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ బహుమతి ఇచ్చిన చిత్రం సాగర సంగమం. అలాగే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కి ఉత్తమ గాయకునిగా జాతీయ అవార్డు . జంధ్యాల మాటలు, వేటూరి పాటలు , నివాస్ ఫోటోగ్రఫీ , తోట తరణి కళా దర్శకత్వం ఇంకా ఎందరో ప్రతిభావంతుల కలయికే ఈ చిత్రాన్ని all time classic గా రూపుదిద్దింది. ఈ చిత్ర శతదినోత్సవానికి హిందీ అగ్ర నటులు రాజకపూర్ , సునీల్ దత్ & రాజేంద్ర కుమార్ గార్లు ముఖ్య అతిధులుగా విచ్చేసి సాగర సంగమం గురించి ఎంతో గొప్పగా విశ్లేషించారు . కమలహాసన్ నూతి మీద డాన్స్ చేసే “తకిట -తధిమి” పాట , జయప్రద తో కలిసి చేసే “ నాద వినోదము “ క్లైమాక్స్ లో వచ్చే “వేదం అణువణువున” పాటల్లో కమలహాసన్ చేసిన క్లాసికల్ డాన్సులు ఇప్పటికీ మనకి ఓ కొత్త  అనుభూతినిస్తాయి . అలాగే మౌనమేలనోయి పాటలో జయప్రద చూపిన హావభావాలు , శరత్‌బాబు, ఎస్.పి.శైలజల నటన, ఈ చిత్రానికి మరో ప్రత్యేకత . సిరి సిరి మువ్వ, శంకరాభరణం తరువాత ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన  మరో కళాత్మక దృశ్య కావ్యం సాగరసంగమం. కళకు అంతం లేదు అనే భావన కలిగేందుకే ఈ చిత్రం చివర్లో “ NO END FOR ANY ART “ అని వస్తుంది .

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Draupadi Murmu: కన్నీళ్లు పెట్టుకున్న రాష్ట్రపతి ద్రౌపది.. టిష్యూ పేపర్ అందించిన భద్రతా సిబ్బంది (video)

వందేభారత్ రైలులో విండో సీటు ఇవ్వలేదని పిచ్చకొట్టుడు కొట్టిన ఎమ్మెల్యే మనుషులు, రక్తం కారింది

అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్.. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే అంతు చూస్తాం...

Rain forecast- నైరుతి రుతుపవనాల ప్రభావం- తెలంగాణ అంతటా వర్షాలు

బీజేపీ అంటేనే ఓ లంగా పార్టీ : బీజేపీ ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments