Webdunia - Bharat's app for daily news and videos

Install App

టక్కర్ కు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని యాక్షన్ సీన్స్ చేశా : హీరో సిద్దార్థ్

Webdunia
సోమవారం, 29 మే 2023 (16:01 IST)
vivek, Karthik G. Krish, Siddharth
నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' వంటి సినిమాలతో హాయిగా సాగే కథలతో సినిమాలు చేసిన హీరో సిద్దార్థ్ యాక్షన్ సినిమా చేసాడు. అదే టక్కర్. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని తీశారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయిక. 2023, జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. 
 
ఈ చిత్ర ప్రొమోషన్స్ లో భాగంగా హీరో సిద్దార్థ్ మాట్లాడుతూ, నన్ను చాలామంది అడుగుతుంటారు మీరు కంప్లీట్ కమర్షియల్ సినిమా చెయ్యొచ్చు కదా అని, దానికి సమాధానమే ఈ సినిమా. ఇప్పటివరకు మిమ్మల్ని ఒక లవర్ బాయ్ లా చూసారు. మిమ్మల్ని నేను కంప్లీట్ డిఫరెంట్ చూపించబోతున్నాను అని చెప్పాడు.
పూర్తి కమర్షియల్ సినిమాగా కార్తీక్ జి. క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో నన్ను కార్తీక్ చాలా కొత్తగా చూపించాడు. యాక్షన్ అండ్ రొమాంటిక్ టచ్ తో ఈ లవ్ స్టోరీ నడుస్తుంది. ఈ ఆగస్టుకి హీరోగా 20 ఏళ్ల కెరియర్ ను పూర్తిచేసినట్టు అవుతుంది. ఇప్పటికీ నా చేతిలో ఓ అరడజను సినిమాలు ఉండటం ఆనందాన్ని కలిగిస్తోంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చేశాను. 35 రోజుల పాటు యాక్షన్ సీన్స్ తీయడం జరిగింది. ఈ సినిమాలో దివ్యాన్ష పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా ఒక యూనిక్ లవ్ స్టోరీ. ఈ జనరేషన్ కి ఈ లవ్ స్టోరీ తప్పకుండా కనెక్ట్ అవుతుంది. అన్నారు. తదనంతరం పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు చిత్ర యూనిట్ సమాధానాలు ఇచ్చింది అన్నారు.
 
దర్శకుడు కార్తిక్ జి క్రిష్ మాట్లాడుతూ, నేను ఏ కంటెంట్ రాసిన ఈ సినిమా కంటెంట్ మాత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది అని చాలామంది చెప్పారు. ఇప్పటివరకు సిద్దార్థ్ ను మీరు ఒక లవర్ బాయ్ గా చూసారు. సిద్దార్థ్ ఒక రగ్గడ్ లవర్ బాయ్ గా ఇందులో చూపించాను.ఈ సినిమా అన్ని సినిమాలలా కాకుండా, కొంచెం కొత్తగా ఉండబోతుంది. ఈ సినిమాలో లవ్ , కామెడీ, రొమాన్స్ అన్ని ఉంటాయి. ఇది న్యూ జనరేషన్ సినిమా అని చెప్పొచ్చు.
 
సహనిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ... ఈ సినిమా మంచి కంటెంట్, సిద్దార్థ్ గారు మంచి పెరఫార్మర్, ఈ సినిమా సిద్దార్థ్ గారికి మళ్ళీ ఆ స్థాయి  హిట్ అవుతుంది. డైరెక్టర్ గారు ఈ సినిమాను చాలా బాగా తీసారు. ఈ సినిమాతో మళ్ళీ మన పాత సిద్దార్థ్ గారిని చూస్తాం. అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో న్యాయం, ధర్మం కనుమరుగైంది.. అమరావతి పేరుతో అవినీతి: జగన్ (video)

మద్యం మత్తులో చోరీకి వెళ్లి ఇంట్లోనే నిద్రపోయిన దొంగ

వంట గ్యాస్ సిలిండర్ పేలుడు : ఒకరు మృతి - ముగ్గురికి గాయాలు

వివేకా హత్య కేసు విచారణ పూర్తయింది : సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ

భార్యాభర్తలపై కాల్పులు జరిపిన ప్రేమికుడు.. నన్ను కాదని అతడితో వెళ్తావా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments