Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి-2'లో 5 తప్పులున్నాయ్... తలపొగరును త‌గ్గించుకోవాలి.. నయనతార ప్రియుడు విఘ్నేష్

'బాహుబలి 2' చిత్రంపై తమిళ యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ తనదైనశైలిలో స్పందించారు. ఈ చిత్రంలో ఐదు తప్పులున్నాయంటూ హీరోయిన్ నయనతార ప్రియుడైన ఈ దర్శకుడు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా

Webdunia
మంగళవారం, 2 మే 2017 (12:33 IST)
'బాహుబలి 2' చిత్రంపై తమిళ యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ తనదైనశైలిలో స్పందించారు. ఈ చిత్రంలో ఐదు తప్పులున్నాయంటూ హీరోయిన్ నయనతార ప్రియుడైన ఈ దర్శకుడు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాహుబలి చిత్రాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ చిత్ర దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళిని ప్రశంసల్లో ముంచెత్తున్నారు. కానీ, విఘ్నేష్ శివన్ మాత్రం మరోలా స్పందించడం గమనార్హం. ఇంతకీ ఈ కుర్ర దర్శకుడు ఏమన్నారో ఓసారి పరిశీలిద్ధాం. 
 
బాహుబలి 2 చిత్రంలో మొదటి తప్పు... ఈ సినిమాను కేవ‌లం 120 రూపాయ‌ల‌కే చూడాల్సి రావ‌డం మొద‌టి త‌ప్పు. అందుకు ప్ర‌తిగా నిర్మాత కోసం ప్ర‌తీ థియేట‌ర్ ద‌గ్గ‌రా ఓ క‌లెక్ష‌న్ బాక్స్‌ను ఏర్పాటు చేయాలి.
 
రెండో తప్పు... సినిమా ర‌న్‌టైం చాలా త‌క్కువ‌గా ఉంది. కేవ‌లం మూడు గంట‌ల్లోనే సినిమా పూర్త‌యిపోవ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు.
 
మూడో తప్పు... ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇదే చివ‌రి సినిమా అవ‌డానికి వీల్లేదు. ఈ సిరీస్‌లో మ‌రో ప‌ది సినిమాల‌ను చూడాల‌నుకుంటున్నాం.
 
నాలుగో తప్పు... టూ మ‌చ్ డిటెయిలింగ్ అండ్ ప‌ర్‌ఫెక్ష‌న్‌. ఈ దెబ్బ‌తో తాము గొప్ప‌వాళ్ల‌మ‌ని విర్ర‌వీగే ద‌ర్శ‌కులంద‌రూ త‌మ హెడ్ వెయిట్‌ను త‌గ్గించుకోవాల్సి ఉంటుంది.
 
ఐదో తప్పు.. బెంచ్‌మార్క్‌ను సెట్ చేయ‌డం చాలా క‌ష్టం. ఈ రికార్డుల‌ను అధిగ‌మించాలంటే చాలా కొన్నేళ్లు పడుతుంది అంటూ ఆయన పేర్కొన్నాడు. 
 
నిజానికి బాహుబ‌లి-2లోని త‌ప్పులను ఎత్తిచూపుతున్నానన్న నెపంతో దర్శకధీరుడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. బాహుబ‌లి-2 చూసి అంద‌రూ రాజ‌మౌళిని ఆకాశానికి ఎత్తేస్తున్న నేప‌థ్యంలో విఘ్నేష్ ఇలా క్రియేటివ్‌గా త‌న ప్ర‌శంస‌ల‌ను అందించడం గమనార్హం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments