Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు వాడైనా తమిళంలో రాణిస్తున్న జయం రవి: 19న మిరుథన్ రిలీజ్

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (12:28 IST)
''జయం రవి.. తెలుగు వాడైనా తమిళంలో రాణిస్తున్నాడు.. తెలుగులో ఎన్నో హిట్‌ సినిమాలను సమర్పించిన మోహన్‌‌గారి కుమారుడు రవి. 'యమపాశం'తో తెలుగులో పేరు తెచ్చుకుంటాడని... నాని అన్నారు. 'జయం' రవి, లక్ష్మీ మీనన్‌ జంటగా శక్తి సౌందర్‌ రాజన్‌ దర్శకత్వంలో సినీకార్న్‌ బ్యానర్‌‌పై ముకేష్‌ ఆర్‌ మెహతా నిర్మించిన తమిళ చిత్రం 'మిరుథన్‌'ను అనే పేరుతో నిర్మాత బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. 
 
ఇమాన్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌ లో రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో నాని థియేట్రికల్‌ ట్రైలర్‌ తో పాటు బిగ్‌ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. 
 
జయం రవి మాట్లాడుతూ.. ఇప్పటివరకు హ్యూమన్‌ వర్సెస్‌ హ్యూమన్‌ సినిమాలు వచ్చాయి. అలాకాకుండా ఓ గ్లోబల్‌ కాన్సెప్ట్‌తో సినిమా చేయాలనుకున్నాం. నేచర్‌ వర్సెస్‌ హ్యూమన్‌ కాన్సెప్ట్‌ తీసుకొని సినిమా చేశాం. మనం ఎన్నో రకాలుగా నేచర్‌‌ను ఇబ్బంది పెడుతున్నాం. ఆ నేచర్‌ మనమీదకు తిరగబడితే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించాం. 55 రోజులు సినిమా షూట్‌ చేశాం. 
 
మేము పెట్టిన ఎఫర్త్స్‌‌‌కు తగ్గ రిజల్ట్‌ వస్తుందని ఆశిస్తున్నాను. ఇమాన్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. ఈ సినిమాలో ఎమోషన్స్‌, లవ్‌, సిస్టర్‌ సెంటిమెంట్‌, యాక్షన్‌ అన్ని అంశాలు ఉంటాయి. ఈ నెల 19న సినిమాను రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో జ్ఞానవేల్‌ రాజా, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, బాలకృష్ణ, ముకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments