Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్ళిన ఉపేంద్ర #యూఐదిమూవీ ఫస్ట్ లుక్ టీజర్

డీవీ
మంగళవారం, 9 జనవరి 2024 (09:54 IST)
Upendra, allu aravind, shivaraj kumar
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తున్న తన తాజా చిత్రం #యూఐ ది మూవీ యూనిక్ టీజర్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రానికి లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్, కెపీ శ్రీకాంత్ నిర్మాతలుగా, నవీన్ మనోహరన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 
తన విలక్షణమైన స్టొరీ టెల్లింగ్ తో ప్రసిద్ధి చెందిన ఉపేంద్ర ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌తో ముందుకు వచ్చారు. బర్త్ డే గింప్స్ ద్వారా తన క్రియేటివ్ విజన్ ప్రదర్శించిన ఆయన  వీక్షకులను ఫాంటసీ ప్రపంచలోకి తీసుకెళ్ళారు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు ఈ కార్యక్రమానికి అతిధి గా హాజరు అయ్యారు.
 
 “ఎటు చూసిన చీకటి. దాన్నుంచి తప్పించుకోవడం ఎలా?” అని ఉపేంద్ర వాయిస్‌తో టీజర్‌ ఓపెన్‌గా.. సినిమా కోసం నిర్మించిన వరల్డ్ అద్భుతంగా అనిపిస్తూ ఆసక్తిని పెంచింది. చివరగా, ఎద్దుపై హీరోయిక్ ఎంట్రీ ఇచ్చిన ఉపేంద్ర... ఇందులో ఎలాంటి వీరోచిత పాత్ర పోషిస్తున్నారో తెలియజేస్తుంది. గ్రాండ్ విజువల్స్, ప్రపంచ స్థాయి VFX, ఆకట్టుకునే  సంగీతం సరికొత్త అనుభూతిని అందిస్తాయి.
 
మేకర్స్ చెప్పినట్లుగా మొత్తం సీక్వెన్స్ వర్చువల్ రియాలిటీ పైప్‌లైన్‌లో చిత్రీకరించారు.   ఇండస్ట్రియల్ లైట్ & మ్యాజిక్ (ILM) క్రియేషన్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు మేకర్స్. దాదాపు 90% చిత్రంలో VFX ఉంటుంది, ఇది నాలుగు వేర్వేరు స్టూడియోలలో జరుగుతుంది.
 
అజనీష్ బి లోక్‌నాథ్ (కాంతారావు ఫేమ్) ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు, ఇందులో రీష్మా నానయ్య (లీడ్ యాక్టర్), నిధి సుబ్బయ్య, మురళీ శర్మ & పి రవిశంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్: శివ కుమార్ జె (KGF1&2 ఫేమ్), సినిమాటోగ్రఫీ HC వేణుగోపాల్ (A & H2O ఫేమ్), VFX ని నిర్మల్ కుమార్ (విక్రాంత్ రోనా ఫేమ్) పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments