Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్‌, సంతోష్‌ శ్రీనివాస్‌, 14 రీల్స్‌ 'హైపర్‌' ఫస్ట్‌ లుక్‌

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హై

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2016 (15:04 IST)
ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ, 'హైపర్‌' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు) టైటిల్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఆగస్ట్‌ 5 నుంచి వైజాగ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్‌ జరుగుతుంది. ఆగస్టు 20వ తేదీ వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో టోటల్‌ టాకీ పార్ట్‌ పూర్తవుతుంది. సెప్టెంబర్‌ 9కి పాటల చిత్రీకరణ కూడా పూర్తవుతుంది. సెప్టెంబర్‌ రెండో వారంలోనే ఆడియో రిలీజ్‌ చేసి సెప్టెంబర్‌ 30న విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం'' అన్నారు. 
 
దర్శకుడు సంతోష్‌ శ్రీన్‌వాస్‌ మాట్లాడుతూ, ''హైపర్‌ అనే టైటిల్‌ రామ్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ సూట్‌ అవుతుంది. సినిమాలోని క్యారెక్టర్‌ కూడా అతని ఎనర్జీకి తగ్గట్టుగానే పవర్‌ఫుల్‌గా ఉంటుంది. యాక్షన్‌తోపాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఈ చిత్రంలో వుంటుంది. ఒక మంచి ఎనర్జీ వున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌'' అన్నారు. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, ఎడిటింగ్‌: గౌతంరాజు, మాటలు: అబ్బూరి రవి, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments