వ‌ద్ద‌నుకున్నా కీర్తిసురేష్ ను వెంటాడిన అదృష్టం!

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (16:06 IST)
keerty
చిరంజీవి ఓ విష‌యంలో త‌నతో సినిమా తీయ‌బోయే నిర్మాత‌లు ఖ‌ర్చు ఎక్కువ‌కావండా జాగ్ర‌త్త చెప్పాడ‌ట‌. ఈ విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఫిలింన‌గ‌ర్‌లో వినిపిస్తోంది. ఈనెల 13న మెగాస్టార్‌తో లూసిఫ‌ర్ రీమేక్ సినిమాను ఆర్‌.బి.చౌద‌రి నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికీ ఇత‌ర పాత్ర‌ల ఎంపిక‌ల‌కు జూబ్లీహిల్స్‌లోని సూప‌ర్‌గుడ్ ఆఫీస్ లో ఆడిష‌న్స్ జ‌రుగుతున్నాయి. ఇదిలా వుండ‌గా, మ‌రోవైపు తమిళ ‘వేదాలం’ రీమేక్ కూడా జ‌ర‌గ‌బోతుంది. ఇందులో ఒరిజిన‌ల్ భాష‌లో అజిత్ చెల్లెలుగా లక్ష్మీ మీనన్ చేసి మెప్పించింది. అయితే తెలుగు రీమేక్ విషయానికి వచ్చే సరికీ మొదటి నుండి దర్శక నిర్మాతలు సాయిప‌ల్ల‌విని సిస్టర్ క్యారెక్టర్ చేయించాలని ఫిక్స్ అయిపోయారు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.
 
మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న ఈ సినిమాలో ఆయన చెల్లెలి పాత్ర కోసం కీర్తి సురేశ్ ను ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంత‌కుముందు ఆ పాత్ర‌ను సాయిప‌ల్ల‌విని అనుకున్నారు. అప్ప‌ట్లో ఆమె అంగీక‌రించిన‌ట్లు తెలిసింది. కానీ ఆ త‌ర్వాత కోవిడ్ వ‌ల్ల మొత్తం సీన్ మారింది. షూటింగ్ వాయిదా ప‌డింది. ఇత‌ర సినిమాల డేట్స్ కూడా మారిపోయాయి. అందుకే తాను ఆ పాత్ర‌ను చేయ‌న‌ని సాయిప‌ల్ల‌వి చెప్పిన‌ట్లు తెలిసింది. అందుకే కీర్తిని చిత్రనిర్మాత‌లు అప్రోచ్ అయ్యార‌ట‌. అందుకు ఆమె మొద‌ట రెండు కోట్లు అడిగింద‌ని తెలిసింది.

ఈ విష‌యం తెలిసిన చిరు.. మ‌హాన‌టిలా త్రూ ఔట్ పాత్ర కాదుక‌నుక అంత ఇవ్వ‌ద‌ని నిర్మాత‌ల‌కు సూచించిన‌ట్లు స‌మాచారం. ఈ ద‌శ‌లో మ‌రో న‌టికోసం ప్ర‌య‌త్నాలు సాగాయి. కానీ ఎవ్వ‌రూ ల‌భించ‌లేద‌ని తెలిసింది. ఇది గ్ర‌హించిన ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ త‌న షూటింగ్ ఎక్క‌డ ఆల‌స్య‌మ‌వుతుందోన‌ని కీర్తిని ఫిక్స్ చేయ‌మ‌ని మెగాస్టార్‌తో మంత‌నాలు జ‌రిపిన‌ట్లు తెలిసింది. ఓకే అన్నాక ఆమెకు మ‌ర‌లా సంప్ర‌దిస్తే అందుకు మ‌రో కోటి జోడించి మూడు కోట్లు అడిగింద‌ని ఫిలింన‌గ‌ర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మ‌హాన‌టి ఎంత ప‌నిచేసిందో కీర్తికి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments