Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్‌లోని థియేటర్‌లో అగ్నిప్రమాదం-అఖండ సినిమా చూస్తుండగా..

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (17:25 IST)
వరంగల్‌లోని థియేటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రేక్షకులు మూవీ చూస్తుండగా...ఒక్కసారిగా థియేటర్ లో పొగలు అలుముకున్నాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. 
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే థియేటర్‌లో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. 
 
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'అఖండ' గురువారం రిలీజైన సంగతి తెలిసిందే. బాలయ్య-బోయపాటి కాంబో కావడంతో ఈ సినిమా సూపర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో ప్రగ్యాజైశ్వాల్, శ్రీకాంత్, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలు చేశారు. 
 
తెలుగు రాష్ట్రాల్లో ధియేటర్లన్నీ బాలయ్య అభిమానులతో నిండిపోయాయి. ఈ క్రమంలో అఖండ సినిమా ప్రదర్శిస్తున్న వరంగల్ లోని జెమిని థియేటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Three Capitals: 2029 తర్వాత తాడేపల్లి నుంచే జగన్ కార్యకలపాలు- సజ్జల మాటల అర్థం ఏంటి?

India First AI Village: భారతదేశంలోనే మొట్టమొదటి ఏఐ గ్రామం ఎక్కడుందో తెలుసా?

86 శాతం పనులు పూర్తి చేసుకున్న భోగాపురం ఎయిర్ పోర్ట్-రామ్మోహన్ నాయుడు

Amaravati: అమరావతిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నోవోటెల్ హోటల్

శ్మశానవాటిక లోపల ఓ మహిళ సెక్స్ రాకెట్ నడిపింది.. చివరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

తర్వాతి కథనం
Show comments