Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వార్థపూరిత విధానాలతో కాదు.. కలిసికట్టుగా ముందుకుసాగుదాం : ప్రసన్న కుమార్

ఠాగూర్
మంగళవారం, 5 ఆగస్టు 2025 (14:05 IST)
ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు చర్చించారని తెలుగు చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ తెలిపారు. ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, ఫిల్మ్ ఛాంబర్‌తోనే మా అసోసియేషన్ కలసి వెళ్తుంది అని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు చెప్పారని వెల్లడించారు. పేద సినీ కార్మికులకు మేము ఎప్పడు అండగా వుంటామన్నారు. రూ.7 లక్షలు రూ.8 లక్షలు కడితేనే యూనియన్‌లో సభ్యత్వం అంటున్నారు. కార్మిక చట్టం ప్రకారం నిర్మాతలు కార్మికులకు ఎక్కువగానే చెల్లిస్తున్నట్టు తెలిపారు. చిన్న నిర్మాతలు, మధ్య తరగతి నిర్మాతలు నలిగిపోతున్నారన్నారు. హీరో ఫేస్‌లు చూసే ప్రేక్షకుడు సినిమా చూస్తారని, మేము చట్టపరంగా న్యాయపరంగా వెళ్తున్నట్టు తెలిపారు. 
 
ఐటీ ఎంప్లాయీస్ కన్నా యూనియన్ కార్మికులకు జీతాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. మా కార్మికులతోనే పని చేయాలి అని యూనియన్ వాళ్ళు చెప్పారు ఇది తప్పు అని పేర్కొన్నారు. కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్‌ను కూడా ధిక్కరించి సమ్మెకు పిలుపు నిచ్చారు ఫెడరేషన్ వాళ్ళు, ఫెడరేషన్ వాళ్ళవి ఏకపక్ష నిర్ణయాలని ఆరోపించారు. కార్మికులు కూడా కలిసి వస్తారు అని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. నిర్మాతల పరిస్థితే బాగోలేదన్నారు. మేం పేద కార్మికులకు వ్యతిరేకం కాదన్నారు. స్వార్థ పూరిత విధానాలతో కాకుండా అందరం ఒక కుటుంబం లాగా కలసి చర్చించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంట గ్యాస్ సిలిండర్ పేలుడు : ఒకరు మృతి - ముగ్గురికి గాయాలు

వివేకా హత్య కేసు విచారణ పూర్తయింది : సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ

భార్యాభర్తలపై కాల్పులు జరిపిన ప్రేమికుడు.. నన్ను కాదని అతడితో వెళ్తావా?

జమ్మూకాశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ?వార్తలను ఖండించిన సీఎం ఒమర్

తిరుమల బాల గంగమ్మ ఆలయం వద్ద చిరుత సంచారం.. పిల్లి చిక్కలేదు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments