Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు వర్ణం దుస్తుల్లో మెరిసిన నిహారిక.. తొలిరోజు పాఠశాలకు వెళ్తున్నట్లు అనిపిస్తోంది..?

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (07:35 IST)
Niharika
మెగా వారసురాలు నిహారిక వివాహం వైభవంగా జరిగింది. వేద మంత్రాల నడుమ చైతన్య జొన్నలగడ్డ ఆమె మెడలో మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచారు. రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో పూలు, తోరణాలతో అందంగా అలంకరించిన మండపంలో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
 
ముహూర్తం వేళ పెళ్లి కుమార్తె నిహారిక బంగారు వర్ణం దుస్తుల్లో మెరిసిపోయారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు వధూవరులను ఆశీర్వదించారు. ఈ శుభకార్యానికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. వారి జీవితం సంతోషం, ప్రేమతో నిండిపోవాలని కోరుకుంటున్నట్లు పోస్ట్‌లు చేశారు.
 
ఈ సందర్భంగా నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఇంకా తన కుమార్తె తొలి రోజు పాఠశాలకు వెళ్తున్నట్లు అనిపిస్తోంది.. కానీ ఆమె సాయంత్రం తిరిగి ఇంటికి రాదని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. 
 
తన చిన్నారి ఎదిగి, పాఠశాలకు వెళ్తున్నప్పుడు ఆమెతో రోజులో 24 గంటలు ఆడుకోలేనని తన మనసుకు చెప్పడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందని అందులో రాసుకొచ్చారు. ఈ సారి ఎంత కాలం పడుతుందో చూడాలి… దాన్ని కాలమే నిర్ణయిస్తుంది. ''నిన్ను చాలా మిస్‌ అవుతున్నా నిహారిక తల్లి" అంటూ పెళ్లి ఫొటో షేర్‌ చేశారు నాగబాబు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments